ఫోటో స్టోరి: నయా గ్లామర్ డాల్

Update: 2017-09-08 04:14 GMT
కొన్నిసార్లు అంతే.. హోమ్లీగా కనిపించడం కూడా హీరోయిన్లకు మైనస్ అయిపోతుంది. అందం.. అంతో ఇంతో అభినయం వచ్చు అనిపించుకున్నా అవకాశాలు మాత్రం అంతంతగానే వస్తుంటాయి. స్టయిల్ మార్చుకోవాలని అనుకున్నా అది అంత ఈజీగా సాధ్యపడదు. దాంతో అదే ఇమేజ్ తో కంటిన్యూ అయిపోవాల్సి వస్తుంది. అదేం కాదు.. ఇమేజ్ మార్చుకోవడానికి ఇంకో మార్గం ఉందంటోంది తీన్ మార్ భామ కృతి కర్బంద.

సుమంత్ తో నటించిన బోణి సినిమా ద్వారా కృతి కర్బంద ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కొద్దికాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. తీన్ మార్ సినిమా మొత్తం ట్రెడిషనల్ గెటప్ లోనే కనిపించింది. తర్వాత ఎనర్జటిక్ స్టార్ రామ్ తో కలిసి ఒంగోలు గిత్త సినిమాలో హీరోయిన్ గా చేసింది. అందులోనూ ఆమెది గ్లామర్ రోల్ కాదు. దీంతో తెలుగులో అదే ఇమేజ్ కంటిన్యూ అయిపోయింది. దీంతో ఇలా లాభం లేదనుకుని బాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది. ఇక్కడ హోమ్లీ క్యారెక్టర్లతో కాకుండా మాంచి గ్లామర్ రోల్స్ చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తోంది.. రాజ్- రీబూట్ సినిమాలో బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీ పక్కన హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లోనూ గ్లామర్ ను మితిమీరి ఆరబోస్తోంది. ఎక్స్ పోజింగ్ లోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

కృతికి తెలుగుకన్నా కన్నడలోనే మంచి పాపులారిటీ వచ్చింది. ఆ భాషలో పదికి పైనే సినిమాల్లో నటించింది. అందులోనూ మంచి హిట్లు కూడా ఉన్నాయి. తెలుగు నుంచి కన్నడలోకి రీ మేక్ అయిన కిక్ - వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాల్లో కృతియే హీరోయిన్ గా నటించింది. అక్కడ మంచి ఇమేజే ఉన్నా బాలీవుడ్ లో గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకోవాలని తెగ ట్రై చేస్తోంది.  ఆమె కోరిక ఎంతవరకు నెరవేరుతుందో వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News