కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో బోలెడంత ఇమేజ్ ఉన్న కృతి కర్బందా అంటే మెగా ఫ్యాన్స్ కు మహా మక్కువ. హీరోయిన్ గా మంచి ఫేమ్ ఉన్నా సరే.. బ్రూస్ లీ మూవీలో రామ్ చరణ్ కు అక్కగా నటించి మెప్పించిన కృతిపై మెగా ఫ్యాన్స్ బాగానే ఇష్టం పెంచేసుకున్నారు.
ఇప్పుడీ బ్యూటీ బాలీవుడ్ లో కూడా సత్తా చాటేస్తోంది. ప్రస్తుతం గెస్ట్ ఇన్ లండన్ అనే మూవీలో నటించేస్తున్న బ్రూస్ లీ అక్క.. లండన్ లో సుదీర్ఘ కాలంపాటు షూటింగ్ చేసేసింది. ఆ సమయంలో అక్కడ గురుద్వారాకు వెళ్లి సేవలు కూడా చేసిందట ఈ భామ. ఎక్కడైనా సెలబ్రిటీ కానీ దేవుడి దగ్గర కాదు కదా.. అందుకే చక్కగా సాంప్రదాయ దుస్తులు ధరించి.. చేతిలో చీపురు పట్టుకుని గురుద్వారాను ఇలా శుభ్రం చేసేసింది. అప్పటి సంగతులను ఇప్పుడిలా పంచుకుంటూ.. షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంది కృతి కర్బందా.
ఇక గెస్ట్ ఇన్ లండన్ మూవీ విషయానికి వస్తే.. పరేష్ రావల్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రంలో.. కార్తిక్ ఆర్యన్ కి జోడీగా నటిస్తోంది కృతి కర్బందా. ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్టెయినర్ గా రూపొందిన గెస్ట్ ఇన్ లండన్.. జూలై 7న థియేటర్లలోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో యూనిట్ అంతా ఫుల్ బిజీగా ఉండగా.. ఈ సినిమా సక్సెస్ అయితే.. తను బాలీవుడ్ లో బిజీ అవుతానని ఆశలు పెట్టుకుంది కృతి కర్బందా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/