6 వేల కోసం టి‌వి నటిని చంపేశారా?

Update: 2017-07-12 04:03 GMT
చాలమందికి కలల నగరం ముంబాయి. దేశంలో ఉన్న ఎవరైనా ముఖ్యంగా సినిమాలో తన ప్రతిభను నిరూపించుకోవాలి అనుకున్నవారు బిజినెస్ లో గొప్ప స్థాయికి ఎదగాలి అనుకున్నవారు చేరే ఒకే తీరం ఈ మహానగరం. అనంతకోటి అవకాశాలలో మనకు ఒక అవకాశం రాకుండా పోతుందా అనే ఆలోచనతో ఆశతో అక్కడకి చాలమందే వస్తారు. కానీ చాల మంది ఆ ఆశలుకు చేరే దారిలో తప్పుదారి పట్టి చివరకు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తారు. కృతికా చౌదరి కూడా అలానే ఎన్నో ఆశలుతో వచ్చి డ్రగ్స్ కు బానిసై చివరకు ఆ ప్రాణాలు కొలిపోయింది.

కొన్ని రోజులు కిందట మోడల్‌ - నటి కృతికా చౌదరి హత్య చేయబడింది. ఇప్పుడు ఆమె చావుకి కారణాలు కొత్త మలుపులు తిరిగాయి. కేవలం రూ.6000 కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు డ్రగ్‌ డీలర్ల దగ్గర నుంచి సంవత్సరం క్రితం ఆమె డ్రగ్స్ కొని వాటికి డబ్బులు చెల్లించలేకపోయిందట. అందుకే కృతికను వాళ్ళు హత్య చేశారు అని పోలీసులు చెబుతున్నారు.  కృతిక హత్య కేసులో ఇద్దరు నిందితులు షకీల్‌ నసీమ్‌ ఖాన్‌, బాద్‌షా బసుదాస్‌ మక్మల్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.  అక్కడే ఉన్న సీసీటీవీ రికార్డు ఆదారంగా వాళ్ళని అరెస్టు చేయడం జరిగింది. ఆమె చనిపోయాన చివరిసారి వీళ్ళు వచ్చి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆమె శరీరం పై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయని తెలియజేశారు పోలీసులు.  
 
అయితే  కృతిక సోదరుడు మాత్రం  ఈ విషయాన్ని కొట్టిపారేశాడు. నా సోదరి దగ్గర రూ.22,000 ఉన్నాయని వాళ్ళు కేవలం డబ్బు కోసమే కృతికను హత్య చేశారని.. డ్రగ్స్ వంటివి ఏవీ లేవని ఆరోపిస్తున్నాడు. జూన్‌ 10న కృతిక తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ముంబాయి డ్రీమ్స్ డైరీ లో ఇది మరో విషాద గాధ.   ​
Tags:    

Similar News