టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో కేఎస్ రామారావు ఒకరు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు నిర్మించారు. సుమారు నాలుగు దశాబ్ధాలుగా చిత్ర నిర్మాణరంగంలో ఉన్న రామారావు సీనియర్ హీరోలు చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ లాంటి వారితో ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. 1983లో 'అభిలాష' చిత్రం నుంచి 2020లో 'వరల్డ్ ఫేమస్ లవర్' వరకూ అనేక చిత్రాలను ప్రొడ్యూస్ చేసారు. చిరంజీవితో 'అభిలాష' 'ఛాలెంజ్' 'రాక్షసుడు' 'మరణ మృదంగం' 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్' వంటి చిత్రాలను నిర్మించారు కేఎస్ రామారావు. తాజాగా కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన కేఎస్ రామారావు అనేక విషయాలను పంచుకున్నారు.
కాగా, కేఎస్ రామారావు ఈ సందర్భంగా 'అభిలాష' సినిమా గురించి మాట్లాడుతూ.. యండమూరి వీరేంద్రనాథ్ కథ రాసేటప్పుడు చిరంజీవి పేరుతోనే కథ రాసుకున్నారు.. వీరేంద్రనాథ్ మరియు దేవి శ్రీ ఫాదర్ సత్యమూర్తి సహకారంతో కొత్త తరహా సినిమాగా 'అభిలాష' సాధ్యమైంది.. ఆ రోజుల్లో ఆ సినిమాకి ఎంత బడ్జెట్ అయ్యిందో ఫిగర్ చెప్తే.. నన్ను అందరూ కోప్పడతారు అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చిరంజీవికి 'మెగాస్టార్' అనే బిరుదు మీరే పెట్టారని విన్నాను.. అది నిజమేనా అని అలీ అడుగగా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు కేఎస్ రామారావు. ''నాకు చిరంజీవి చాలా ఎఫెక్షనేటివ్ హీరో.. అప్పటికే ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయి. సూపర్ స్టార్ అని.. సుప్రీమ్ హీరో అని.. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ టైంలో ఓ కొత్త తరహా పేరు మన హీరోకి ఉండాలి.. ఇక ఇంతకంటే మంచి పేరు మన హీరోకి ఎవరూ పెట్టలేరనిపించేలా ఆలోచించి పెట్టిందే 'మెగాస్టార్'. అలా చిరంజీవి 'మెగాస్టార్ చిరంజీవి' అయ్యారు'' అని వెల్లడించారు కేఎస్ రామారావు.