ఫ్లైట్ లో కృష్ణుడి గెటప్ లో ఎన్టీఆర్

Update: 2017-06-15 04:28 GMT
రజినీకాంత్ తో నరసింహ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తీసిన దర్శకుడు కేఎస్ రవికుమార్.. ఇప్పుడు బాలకృష్ణ మరుసటి చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. బాలయ్య 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తమిళ్ వెర్షన్ ట్రైలర్ లాంఛ్ కు హాజరైన ఈ దర్శకుడు.. ఈ చిత్రాన్ని 79 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిసి ఆశ్చర్యపోయానంటున్నాడు. ఇలా చేసేందుకు పంక్చువాలిటీ చాలా ముఖ్యమని.. ఈ విషయంలో తండ్రి నుంచి బాలకృష్ణ ఎన్నో నేర్చుకున్నారని అన్నాడు.

'ఎన్టీఆర్ గారి గురించి నాకు నగేష్ చెప్పారు. అప్పట్లో నగేష్ తెలుగు-తమిళ్ సినిమాలతో తెగ బిజీగా ఉండేవారు. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కి హైద్రాబాద్ వెళ్లేందుకు గాను.. ఓ సారి ఉదయాన్నే ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. అయితే ఎయిర్ పోర్టుకు రావడం లేట్ అవడం.. ఆ తర్వాత ఫ్లైట్ కు బయల్దేరడం జరిగాయి. తీరా ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాక పక్కకు చూస్తే.. పక్కనే శ్రీకృష్ణుడి గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ దర్శనం కలిగింది. అదేంటని నగేష్ అడిగితే.. "మనం హైద్రాబాద్ చేరుకుని షూటింగ్ స్పాట్ కి వెళ్లేసరికి 2 గంటలు లేట్ అవుతుంది. కరెక్ట్ టైంకి షూటింగ్ స్టార్ట్ చేసేందుకే ఇలా సిద్ధమైపోయాను" అని ఎన్టీఆర్ చెప్పారట' అంటూ ఎన్టీఆర్ పంక్చువాలిటీ గురించి చెప్పాడు కేఎస్ రవికుమార్.

తాను రజినీకాంత్ తో 'రాణా' అనే పేరుతో చారిత్రక చిత్రాన్ని తీయాలని భావించానని చెప్పిన ఈ దర్శకుడు.. ఇందుకోసం 276 రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలిపాడు. అయితే.. ఈ ప్రాజెక్టు సాధ్యం కాలేదని చెప్పిన కేఎస్ రవికుమార్.. ఒకవేళ ‘రాణా’ సినిమా పూర్తయి రిలీజయ్యుంటే ‘బాహుబలి’ ప్రభంజనాన్ని తాము అప్పుడే రీచ్ అయ్యేవారమేమో అన్నారు. అలాగే దర్శకుడు క్రిష్ నుంచి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని.. గౌతమిపుత్రశాతకర్ణి చూసిన తర్వాత తెలిసిందని చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News