తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘క్షణం’. అడవి శేషు - అదా శర్మ హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమాను బాలీవుడ్ టైగర్ ష్రాఫ్ - దిశా పఠానీ ప్రధాన పాత్రల్లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ‘భాఘీ 2’ పేరుతో రూపొందిన ఈ చిత్రం... శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ పక్కా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా కాస్తా... అక్కడికి వెళ్లే సరికి పక్కా యాక్షన్ మూవీగా మారిపోయింది.
‘భాఘీ 2’ ట్రైలర్ విడుదలయ్యినప్పుడే - క్షణం సినిమాలో ఇన్ని యాక్షన్స్ సీన్స్ ఎక్కడి వబ్బా...! అని ఆశ్చర్యపోయారు తెలుగువాళ్లు. అయితే యాక్షన్ కాస్త ఎక్కువైనా కథ అలాగే ఉంటుంది... ఆ కథనం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది అనుకున్నారంతా! కానీ రిజల్ట్ మాత్రం వేరేలా వచ్చింది. అడవి శేషు కథను మాత్రం తీసుకున్న అహ్మద్ ఖాన్... దాన్ని తెరకెక్కించడంలో మాత్రం పూర్తి స్వేచ్ఛ తీసుకున్నాడు. క్షణం సినిమాకీ - భాఘీ 2 సినిమాకీ పొంతన లేకుండా తీశాడు. క్షణం సినిమాలో తనకి కూతురు ఉందని నిరూపించుకునేందుకు అదా శర్మ పడే తాపత్రయం హైలెట్ గా నిలిచింది. కానీ భాఘీ 2లో కండలు పెంచుకుని టైగర్ ష్రాఫ్ పడిన కష్టాన్ని తెరపైన చూపించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
క్షణం సినిమా చూసిన వాళ్లకైతే ‘భాఘీ 2’ కచ్చితంగా నచ్చదు. చూడని వాళ్లకి మాత్రం ఓ మాదిరిగా నచ్చే ఆస్కారం ఉంది. అదీ మనోడి కథ వల్లే. ట్రైలర్ ఇంప్రెస్ చేయడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి ఈ సినిమాకీ. అయితే ఈ ‘క్షణం’ రీమేక్ సోల్ ని మిస్ చేయడంతో... సీనియర్ హీరోయిన్ టబు- మనోజ్ బాజ్ పాయ్- అన్ను కపూర్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ‘మిస్సింగ్’ సినిమా అయిన తెలుగులోని థ్రిల్ రుచి చూపిస్తుందో... లేదో చూడాలి. ఈ మధ్యే విడుదల ట్రైలర్ క్షణం సినిమాని తలపించిన విషయం తెలిసిందే.