భరత్ కు తోడుగా కేటిఅర్

Update: 2018-04-25 09:24 GMT
భరత్ అనే నేను సినిమా చూసాక ప్రేక్షకులకు కలిగిన అభిప్రాయం ఒక్కటే. నిజంగా ఇలా జరిగితే ఎంత బాగుంటుందో కదా అని. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య గురించి చూపించిన పరిష్కారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి స్వయం ప్రతిపత్తి లాంటి సంస్కరణలు తీసుకురావడం గురించి కొరటాల శివ చక్కగా చూపించాడు. ఇక మహేష్ యాక్టింగ్ గురించి చెప్పాల్సింది ఏమి లేదు. భరత్ అభిమానుల మనసులనే కాదు నిజమైన రాజకీయ నాయకులను కూడా మెప్పిస్తున్నాడు. సినిమా చూసాక భరత్ కు అండగా నిలవడానికి వారు కూడా జత కలుస్తున్నారు. సినిమా రంగంలో మంచి మిత్రులున్న తెలంగాణా ఐటి శాఖా మంత్రి కేటిఆర్ మహేష్ తో సహా టీం తో కలిసి భరత్ అనే నేను స్పెషల్ ప్రీమియర్ ని చూసేసారు. అందులో ఉన్న థీమ్ గురించి అందరు గొప్పగా చెబుతుంటే తనకూ చూడాలని ఆసక్తి కలిగిందన్న కేటిఅర్ ఎక్కువ ఆలస్యం చేయకుండా షో వేయించుకున్నారు.

ఇక్కడ మహేష్ ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్ ఏంటంటే సినిమా సిఎం మహేష్ తో కలిసి తెలంగాణా మినిస్టర్ కేటిఅర్ ఒకే ఇంటర్వ్యూలో కలిసి పాల్గొన్నారు. సినిమాలో చూపించిన అంశాలతో పాటు నిజ జీవితంలో కేటిఅర్ ఫాలో అవుతున్న పద్దతుల గురించి ఇద్దరు అందులో చర్చించినట్టు తెలిసింది. సినిమా బాగా నచ్చడం వల్లే ఇది ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో కేటిఅర్ ఈ వినూత్నమైన కార్యక్రమానికి ఓకే చెప్పినట్టు టాక్. కొరటాల శివ కూడా పాల్గొన్న ఈ ఇంటర్వ్యూ స్పెషల్ షో పూర్తి కాగానే షూట్ చేసినట్టు సమాచారం. ఏ ఛానల్ లో వస్తుంది టైమింగ్ ఏంటి అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

సినిమా బాగా న‌చ్చ‌డంతో కేటీయార్‌.. మ‌హేష్, కొరటాల శివ‌ను అభినందించారు. సినిమాను అభినందిస్తూ ట్వీట్ చేశారు. సినిమాను చాలా ఎంజాయ్ చేశాన‌ని, స్నేహితుడు మ‌హేష్‌ - డైరెక్ట‌ర్ కొరటాల శివ‌తో మాట్లాడాన‌ని కేటీయార్ ట్వీట్ చేశారు

ఒక మంచి కాజ్ కోసం రూపొందిన సినిమాను నిజమైన రాజకీయ నాయకుడు మెచ్చుకోవడం విశేషమే. కాకపోతే సినిమాలో చూపించినట్టు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సంస్కరణల కోసం కేటిఅర్ కనక వేల రూపాయల ఫైన్లను ఇక్కడ కూడా తీసుకొస్తే ఎలా అని సోషల్ మీడియాలో నెటిజెన్లు సరదాగా కామెంట్స్ చేసుకుంటున్నారు. భరత్ కు బాసటగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కేటిఅర్ కోసం ఫాన్స్ మాత్రమే కాదు సినిమా లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు.

మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి
Tags:    

Similar News