ఐపీఎస్ మహిళను ఐటెం గాళ్ చేశారే

Update: 2017-09-03 09:41 GMT
ఇమేజ్ ను కంప్లీట్ గా మార్చేయాలంటే.. పూరీ జగన్నాధ్ చేతిలో ఒక్కసారి పడితే చాలు అన్నది ఇండస్ట్రీ టాక్. అఫ్ కోర్స్.. అది నిజమే కూడా. హీరోలను గతంలో ఎన్నడూ చూడనంతటి యారోగెంట్ గా.. నిర్లక్ష్యంగా పూరీ సినిమాల్లో చూడచ్చు. ఇప్పుడది రొటీన్ అయిపోయినా.. హీరోయిన్స్ లాంఛింగ్ విషయంలో కూడా పూరీకి మంచి టేస్టే ఉంది.

అలాగని తనపై ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా ఉంటుందో.. పైసా వసూల్ మూవీలో చూపించాడు పూరీ జగన్నాధ్. కైరా దత్ జనాలకు బాగానే తెలుసు. మోడల్ గా అరంగేట్రం చేసి.. ఐటెం సాంగ్స్ తో క్రేజ్ పెంచుకుంటూ.. తన అల్ట్రా మోడర్న్ గ్లామర్ అవతారాన్ని బాగానే ధారపోస్తూ ఉంటుంది. ఇలాంటి భామ పూరీ సినిమాలో కనిపిస్తే.. అందాల కిక్ మరో రేంజ్ కి వెళుతుందని అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. పైసా వసూల్ ట్రైలర్ లో కూడా దాదాపుగా ఇదే ఎసెన్స్ చూపించాడు పూరీ. అంతే కాదు.. ఐటెం సాంగ్ లో కైరా దత్ వేసిన చిందులను కూడా ట్రైలర్ లోనే మిక్స్ చేసిన ఈ దర్శకుడు.. మూవీలో అంతకు మించి ఘాటైన గ్లామర్ నే ఎక్స్ పోజ్ చేశాడు.

కానీ సినిమాలో ఆమె పాత్ర ఓ అండర్ కవర్ ఐపీఎస్ ఆఫీసర్. ఏసీపీ కిరణ్మయి రోల్ లో కైరా కనిపించింది. అయితే.. ఓ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రను ఐటెం గాళ్ గా మార్చేసి.. అండర్ కవర్ అనడంలో పూరీ చెప్పదలచుకున్న పాయింట్ ఏంటో మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. పోలీస్ పాత్రలను గొప్పగా చూపిస్తానని మొన్నామధ్య డ్రగ్స్ ఉదంతంలో తనకు తానే చెప్పుకున్న పూరీ.. ఇప్పుడు ఓ ఐపీఎస్ ఆఫీసర్ రోల్ తో ఐటెం సాంగ్ చేయించడంపై ఏమంటాడో?
Tags:    

Similar News