చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో కిందా మీదా అయిపోతున్నాయి ఈ రోజుల్లో. పోటీ లేకుండా ఓ మంచి డేటు దక్కించుకోవడం చాలా కష్టమైపోతోంది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఈ విషయంలో బాగా ఇబ్బంది ఎదురవుతోంది. అందుకే ఎందుకైనా మంచిదని ముందు చూపుతో అడ్వాన్స్ బుకింగ్స్ చేసేస్తున్నారు. ఈ నెలలో సంక్రాంతి సినిమాల మీదే అందరి దృష్టీ నిలిచి ఉండగా.. ఆ తర్వాతి రెండు వారాలకు రెండు ఆసక్తికర చిన్న సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి.
సంక్రాంతి తర్వాత వచ్చే శుక్రవారం నందినిరెడ్డి-నాగశౌర్య కాంబినేషన్ లో తెరకెక్కిన కళ్యాణ వైభోగమే విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ఆడియో కూడా విడుదలైంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతానికి సంక్రాంతి తర్వాతి శుక్రవారానికి పోటీలో ఉన్న సినిమా ఇదొక్కటే. మరోవైపు ఈ నెల చివరి శుక్రవారానికి కూడా ఓ ఆసక్తికర సినిమా ఫిక్స్ అయింది. అదే.. లచ్చిందేవికి ఓ లెక్కుంది.రెండు నెలల కిందటే ఫస్ట్ కాపీతో రెడీ అయిన ఈ సినిమా మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తోంది. ఐతే డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రతిసారీ వేరే పెద్ద సినిమాలు అడ్డు తగలడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పటికే మూడుసార్లు డేట్లు మార్చుకున్న ఈ చిత్ర నిర్మాతలు ఈసారైనా అనుకున్న ప్రకారం సినిమా విడుదల చేస్తారేమో చూడాలి.