హీరో అండ్ సెకండ్ హీరో లేకుండానే విచారణ

Update: 2017-07-25 16:30 GMT
ఇప్పుడు అందరూ కూడా డ్రగ్స్ కేసు విచారణ ఎలా జరగబోతుందో అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ నోటీసులు అంందుకున్న సెలబ్రిటీలు ఎవరైనా పొరపాటను దొరికేస్తారా? వారి దగ్గర కలక్ట్ చేసిన బ్లడ్ సాంపిల్స్ ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఏ విధంగా రానుంది? ఇవన్నీ అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఈ క్రమంలో ఎక్సయిజ్ డిపార్టమెంట్ ను అలానే ఎన్ఫోర్సమెంట్ డైరక్టర్ అకున్ సభర్వాల్ ను చాలామంది ఒక హీరోగా అభిమానిస్తున్నారు. గతంలో సిబిఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణను చూసిన తరహాలో ఇప్పుడు అకున్ కూడా అదే విధమైన ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.

విషయం ఏంటంటే.. ఇప్పుడు హీరోయిన్ ఛార్మి మరియు ఐటెం గాళ్‌ ముమాయత్ ఖాన్ ల విచారణను మహిళా అధికారులతో జరిపించాలని కోర్టు అదేశించింది. అందుకోసం ఆల్రెడీ వీరిని ప్రశ్నించడానికి ఒక టీమ్ ను కూడా రెడీ చేస్తున్న అకున్ అండ్ కో. కాకపోతే విషయం ఏంటంటే.. ఇప్పుడు ఈ విచారణలో హీరో క్యారెక్టర్ అకున్.. అలాగే సెకండ్ హీరో అయిన ఒక ఎస్సై (కెల్విన్ ను అరెస్ట్ చేసిన ఆయన) పాల్గొనకపోవడంతో.. నిజాలు ఈ లేడీ టీమ్ ఎలా బయటకు తెస్తారో అంటూ సోషల్ మీడియాలో తెగ బాధపడిపోతున్నారు జనాలు. అందుకే హీరో అండ్ సెకండ్ హీరో లేకుండా సినిమాయేంటి అంటూ కామెడీగా కామెంట్లు చేస్తున్నారు కూడా.

అయితే దర్యాప్తు ఎవరు చేసినా కూడా.. ప్రశ్నాపత్రం సెట్ చేసేది మాత్రం అకున్ సభర్వాల్ అనే తెలుస్తుంది. ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగానే ఇప్పుడు లేడీ అఫీషియల్స్ బృందం ఈ భామలను ప్రశ్నించబోతోంది. కాబట్టి పెద్దగా వర్రీ అవ్వకండయ్యా అభిమానుల్లారా!!


Tags:    

Similar News