టాలీవుడ్ లో హీరోలకు సమాంతరంగా సాగే పవర్ ఫుల్ లేడీ విలన్ లకు కొరత వున్న విషయం తెలిసిందే. గతంలో ఈ తరహా పాత్రలకు చాలా మంది వుండేవారు కానీ పోను పోను మేల్ డామినేషన్ అధికం కావడంతో లేడీ విలన్ ల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. కానీ మళ్లీ పుంజుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సినిమాల్లో పవర్ ఫుల్ లేడీ విలన్ అంటే ప్రతీ ఒక్కరికీ టక్కున గుర్తొచ్చే పేరు నీలాంబరి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'నరసింహా' మూవీలో రమ్యకృష్ణ నీలాంబరిగా నటించి అదరగొట్టేసింది.
ఇప్పటికీ ఆ పాత్రనే తలుచుకుంటున్నామంటే రమ్యకృష్ణ ఆ పాత్రలో పలికించిన హావభావాలే ఇందుకు ప్రధాన కారణం. అంతగా ఆమె ఆ పాత్రని రక్తి కట్టించారు. ఆ తరువాత ఆస్థాయి పాత్రలకు మరో నటి కనిపించలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ కు వరలక్ష్మీ శరత్ కుమార్ రూపంలో ఆ లోటు తీరినట్టేనని, పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మీ రూపంలో మంచి నటి లభించిందని ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది.
శింబు నటించిన 'పొడా పొడీ' మూవీతో శరత్ కుమార్ నటవారసురాలిగా తెరంగేట్రం చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్ కెరీర్ ప్రారంభంలో తండ్రి కారణంగా గోల్డెన్ ఛాన్స్ లని మిస్ చేసుకుంది. ఆ తరువాత హీరోయిన్ గా, ప్రాధన్యత వున్న పాత్రల్లో నటిస్తూ నటిగా ఎన్నో సవాళ్లని ఎదుర్కొంది. నెపోటిజమ్ తో పాటు కాస్టింగ్ కౌచ్ ని కూడా ఎదుర్కొన్నానని పలు సందర్భాల్లో వెల్లడించింది కూడా. గ్లామర్ పాత్రల్లో నటిస్తూనే నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రల్లో నటించడం మొదలు పెట్టింది. విశాల్ నటించిన 'పందెం కోడి 2' మూవీతో నెగెటివ్ క్యారెక్టర్ లలో నటించడం మొదలు పెట్టింది.
సినిమా పోయినా నటిగా వరలక్ష్మికి మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. ఆ తరువాత విజయ్ నటించిన 'సర్కార్', ధనుష్ 'మారి 2' నటిగా వరలక్ష్మి కెరీర్ ని పూర్తిగా మార్చేశాయి. తెలుగులో 'తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బీ'లో నటించి తెలుగు ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది. ఇక మాస్ మహారాజా రవితేజతో గోపీచంద్ మలినేని రూపొందించిన 'క్రాక్'లో జయమ్మగా కనిపించి అదరగొట్టింది. ఆ తరువాత సమంత నటించిన 'యశోద'లోనూ ప్రతినాయికగా కనిపించి ఆకట్టుకుంది.
ఈ సినిమాతో బిగ్ లీగ్ లోకి వెళ్లిన వరలక్ష్మీ తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి'లో పవర్ ఫుల్ లేడీ విలన్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఇందులో బాలయ్యకు సోదరిగా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ అతనిపైనే పగ తీర్చుకునే పాత్రలో నటించి తనదైన మార్కు నటనతో అందరిని కట్టిపడేస్తోంది. ఈ మూవీలో తన నటనని చూసిన నెటిజన్ లు టాలీవుడ్ కు పవర్ ఫుల్ లేడీ విలన్ దొరికి నట్టేనని, ఆ లోటు తీరినట్టేనని నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.