నాగచైతన్య- నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన బంగార్రాజు సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. మిశ్రమ స్పందనలు వచ్చినా సోలోగా ఈ సినిమా పండగ వసూళ్లను దండుకుంటోంది. తదుపరి నాగ్ ప్రవీణ్ సత్తారు ఘోస్ట్ చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే నాగచైతన్య తన తదుపరి రిలీజ్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య `లాల్ సింగ్ చద్దా` చిత్రంతో డైరెక్ట్ గా హిందీ చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. అక్కడ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారని కథనాలొచ్చాయి. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఆంధ్రాకు చెందిన ఆర్మీ అధికారిగా ఈ చిత్రంలో నాగచైతన్య కనిపించనున్నారు.
లాల్ సింగ్ చద్దాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించగా.. ఎరిక్ రోత్ - అతుల్ కులకర్ణి స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్- వయాకామ్ 18 స్టూడియోస్ - పారామౌంట్ పిక్చర్స్ నిర్మించాయి. విన్ స్టన్ గ్రూమ్ 1986 నవల ఆధారంగా 1994లో వచ్చిన అమెరికన్ చలనచిత్రం ఫారెస్ట్ గంప్ కి రీమేక్ ఇది. ఈ చిత్రంలో కరీనా కపూర్ ఓ నాయిక.
ఫారెస్ట్ గంప్ అనుసరణ రెండు దశాబ్దాల వ్యవధిలో వరుస మార్పులకు గురైంది. అతుల్ కులకర్ణి మొదటి పదేళ్లపాటు స్క్రిప్ట్ హక్కులను స్వీకరించి.. మరో పదేళ్లు రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడు. లాస్ ఏంజిల్స్ కు చెందిన నిర్మాత - దర్శకురాలు రాధికా చౌదరి సహాయంతో 2018 ప్రారంభంలో సినిమా హక్కులను కొనుగోలు చేసిన అమీర్ ఖాన్ 14 మార్చి 2019న దాని టైటిల్ తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
`లాల్ సింగ్ చద్దా` 100 కంటే ఎక్కువ భారతీయ ప్రదేశాలలో చిత్రీకరించబడింది. 31 అక్టోబర్ 2019న చండీగఢ్ లో షూట్ ప్రారంభమైంది. అయితే భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా మార్చి 2020లో ప్రొడక్షన్ ఆపివేసారు. సెప్టెంబరు 2020 మధ్యలో ఢిల్లీలో పునఃప్రారంభించారు. దీని కారణంగా ఈ చిత్రం - మొదట్లో క్రిస్మస్ 2020 విడుదలకు షెడ్యూల్ చేసినా వైరస్ విడవక డేట్ మారింది - ఒక సంవత్సరం మొత్తం ఆలస్యమైంది. ఇప్పుడు 14 ఏప్రిల్ 2022న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.