బంగార్రాజు కోసం 'స్వర్గం' ను దించేస్తున్నారా?

Update: 2021-08-21 06:41 GMT
అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని బంగార్రాజు పాత్ర నేపథ్యంలో ఒక సినిమాను చేయాలని అప్పుడే అనుకున్నారు. అప్పటి నుండి కథ వండుతూనే ఉన్నారు. ఎట్టకేలకు బంగార్రాజు కోసం ఒక మంచి కథ సెట్‌ అయ్యింది. నాగార్జున మరియు నాగచైతన్యలు కలిసి నటించబోతున్న బంగార్రాజు సినిమా కోసం ప్రత్యేకమైన సెట్‌ లను నిర్మిస్తున్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో స్వర్గం కు సంబంధించిన సన్నివేశాలు ఉండబోతున్నాయట.

సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కూడా యమ లోకం కు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. కాని బంగార్రాజులో మాత్రం అంతకు మించి అన్నట్లుగా సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. అందుకే సినిమా కోసం పెద్ద ఎత్తున సెట్టింగ్‌ నిర్మాణం జరుగుతుందని తెలుస్తోంది. స్వర్గం కు సంబంధించిన సన్నివేశాలు బంగార్రాజులో ఎక్కువ ఉంటాయి కనుక అందుకోసం భారీ సెట్టింగ్‌ ను అన్న పూర్ణ స్టూడియోలో నిర్మించే పనిలో యూనిట్‌ సభ్యులు ఉన్నారట. చాలా విభిన్నమైన శైలిలో ఉండే బంగార్రాజు సినిమా కోసం ప్రత్యేకంగా సెట్టింగ్స్ ను నిర్మిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్న ఆ సెట్టింగ్స్ తుది దశకు చేరుకున్నాయని.. వచ్చే వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి బంగార్రాజు కోసం అయిదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఖచ్చితంగా ఒక మంచి సినిమాను యూనిట్‌ సభ్యులు అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా చిత్రీకరణ ప్రారంభించి ఏకధాటిగా నిర్వహించి వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను విడుదల చేస్తారు అనేది అన్నపూర్ణ వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో చైతూకు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని కన్ఫర్మ్‌ అయ్యింది. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నే కంటిన్యూ అవుతుందా అనే విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది.
Tags:    

Similar News