ఆర్‌ఆర్ఆర్ విడుదలకు సిద్దంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అంటూ ఎదురు చూసిన ప్రతి ఒక్క సినీ ప్రేమికుడి కల నెరవేరే సమయం ఆసన్నం అయ్యింది. ఈనెల 25వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా నభూతో నభవిష్యత్తి అన్నట్లుగా ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్దం అయ్యింది. ప్రపంచ ప్రసిద్ది గాంచిన భారీ మల్టీ ప్లెక్స్ లతో పాటు చిన్న సింగిల్ స్క్రీన్ ల్లో వరకు ప్రతి చోట కూడా సందడి వాతావరణం నెలకొంది.
ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ తో అంచనాలు మరింతగా పెంచేస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రముఖ దర్శకుడు అనీల్ రావిపూడి హీరోలు మరియు దర్శకుడిని ఇంటర్వ్యూ చేశారు. అనీల్ రావిపూడి తో ఇంటర్వ్యూలో ఎన్టీఆర్.. చరణ్ ఇంకా రాజమౌళి పలు విషయాల్లో ఓపెన్ అయ్యారు. కొన్ని విషయాల్లో సస్పెన్స్ కొనసాగిస్తున్నా పలు విషయాలపై మాత్రం క్లారిటీ ఇచ్చారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ మరియు చరణ్ ల స్నేహం గురించి ఉన్న అనుమానాలు పటాపంచలు అయ్యేలా ఒక క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్ లో ఇద్దరు కూడా స్టార్ హీరోలు.. ఒకరి సినిమా పై మరొకరి సినిమా పోటీ అన్నట్లుగా ఢీ కొట్టిన సందర్బాలు ఉన్నాయి. ఇద్దరి అభిమానులు కూడా సోషల్ మీడియాలో యుద్దాలే చేసిన సంఘటనలు మరియు సందర్బాలు చాలానే ఉన్నాయి. కాని వీరిద్దరి స్నేహం మరో లెవల్ అని తేలిపోయింది.
సినిమా కోసం జక్కన్న దర్శకత్వంలో వీరిద్దరు స్నేహం గా ఉంటున్నారేమో అని.. సినిమా ప్రమోషన్ లో భాగంగా వీరిద్దరు జనాల అటెన్షన్ ను దక్కించుకునేందుకు ఎప్పటి నుండో స్నేహితులం అని చెప్పుకుంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారేమో అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కాని అసలు విషయం ఏంటీ అంటే వీరిద్దరు ఈ సినిమా కంటే చాలా ముందే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ అనేది అనీల్ రావిపూడి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
చాలా మందికి తెలియని విషయం ఏంటీ అంటే ప్రణతి పుట్టిన రోజు తర్వాత ఒక్క రోజులోనే చరణ్ పుట్టిన రోజు వస్తుంది. అంటే మార్చి 26వ తారీకున ప్రణతి పుట్టిన రోజు అయితే ఆ తర్వాత రోజు మార్చి 27వ తారీకు చరణ్ బర్త్ డే. ప్రణతి పుట్టిన రోజు అంతా తనతోనే ఉంటాను. అర్థ రాత్రి 12 గంటలు అయితే చరణ్ ఇంటి ముందు నా కారు ఆగుతుంది. ఇద్దరం కలిసి కారులో బయటకు వెళ్తాం. ప్రణతి ఎటు వెళ్లావు అంటే బయటకు వచ్చాను అంటాను. నా బర్త్ డే కదా అంటే నీది పూర్తి అయ్యింది కదా.. ఇప్పుడు చరణ్ బర్త్ డే అంటూ చాలా సార్లు మేమిద్దరం కలిసి తిరిగిన రోజులు ఉన్నాయని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
ఇన్నాళ్లు చరణ్ మరియు ఎన్టీఆర్ ల మద్య నిజంగా ఇంత స్నేహం ఉందా.. సినిమా కోసమే వీరిద్దరు యాక్టింగ్ చేస్తున్నారా అంటూ కొందరిలో ఉన్న అనుమానాలకు ఈ సమాధానం తెర దించినట్లు అయ్యింది. వీరిద్దరు కూడా సుదీర్ఘ కాలంగా స్నేహంగా ఉంటూ వస్తున్నారు. అందుకే ఈ సినిమా లో నటించేందుకు ఓకే చెప్పారు. రామ్ చరణ్ పారితోషికం కూడా ఎన్టీఆర్ ఈ సినిమా కు మాట్లాడాడట. ఈ సంఘటన కూడా వారి స్నేహం ను నిరూపిస్తుంది.