రూ.20 కోట్లు ఇస్తా నన్ను పెళ్లి చేసుకో.. హీరోకి ఆఫర్‌

Update: 2022-03-11 06:56 GMT
సినిమా స్టార్స్ అంటే జనాల్లో ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్స్ కాకున్నా కూడా సెలబ్రెటీ అయినా కూడా మంచి గుర్తింపు ఉంటే చాలు వారి వెంట జనం పడతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందమైన సెలబ్రిటీ అమ్మాయిలను ఎంతగా కుర్రకారు ఆరాధిస్తారో అంతే స్థాయిలో సెలబ్రిటీ కుర్రాళ్లను అమ్మాయిలు ఆరాధిస్తారు.. అభిమానిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కుర్ర హీరోలకు ముఖ్యంగా రొమాంటిక్‌ హీరోలకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. దాంతో వారిని జనాలు ఆహా ఓహో అంటూ అభిమానిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఆ హీరోలు అంటే పడి చస్తారు. తెలుగు హీరోల్లో విజయ్ దేవరకొండ తో పాటు మరి కొందరు హీరోలకు అమ్మాయిల్లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంటుంది. ఒక్క సారి వారిని చూడాలని.. వారితో సెల్ఫీ తీసుకోవాలని కోరుకునే వారు లక్షల మంది ఉంటారు.

ఇక బాలీవుడ్‌ స్టార్స్ కు కూడా అంతకు మించి స్టార్ డమ్‌ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఒక బాలీవుడ్‌ యంగ్‌ స్టార్ కు లేడీ ఫ్యాన్ నుండి వచ్చిన పెళ్లి ప్రపోజల్ వైరల్ అవుతోంది. ఆమె డైరెక్ట్ గా తనను పెళ్లి చేసుకోమంటూ కోరింది.

అందుకు గాను తాను ఏకంగా రూ.20 కోట్ల రూపాయలు ఇస్తాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఆ బాలీవుడ్‌ యంగ్‌ హీరో పేరు కార్తీక్‌ ఆర్యన్‌. యూత్‌ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న యంగ్ హీరో కు ఒక అభిమాని ఈ ఆఫర్ ను ఇచ్చింది. కార్తీక్‌ అంటే తనకు ప్రాణం అన్నట్లుగా ఆమె పేర్కొనడంతో పాటు అతను ఒప్పుకుంటే ఇరవై కోట్ల రూపాయలను కట్నంగా ఇస్తానంటూ చెప్పడం కూడా ఆసక్తికరంగా మారింది. అతడు అంటే ఎంత ఇష్టం ఉంటో ఈ స్థాయిలో డైరెక్ట్‌ ప్రకటన చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

కార్తీక్‌ ఆర్యన్‌ ఈమద్య కాలంలో హీరోగా వరుసగా మంచి సక్సెస్ లను దక్కించుకుంటున్నాడు. యూత్‌ ఫుల్‌ ఎంటర్ టైనర్స్ తో ఈయన చేస్తున్న సినిమాలు.. చేసిన సినిమాలు ఆయన స్థాయిని పెంచాయి. అందుకే అమ్మాయిలు ఇంతగా ఆయనంటే పడి చస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకు ఆ లేడీ ఫ్యాన్‌ అభిమానాన్ని మరియు ప్రేమను గురించి కార్తీక్‌ ఆర్యన్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడు అనేది చూడాలి.
Tags:    

Similar News