చందమామా ఆ కొత్త ఫ్రెండు ఎవ‌రు?

Update: 2022-03-30 04:40 GMT
కాజల్ అగర్వాల్ గర్భధారణ సమయంలో తన ప్రియమైన స్నేహితుడిని పరిచయం చేసింది. అయితే ఆ ఫ్రెండు ఎవ‌రు? అంటే.. అది భర్త గౌతమ్ కిచ్లు కానే కాదు. ఇంకెవ‌రు? అంటే....చాలా సంగ‌తులున్నాయ్!

చంద‌మామ కాజ‌ల్ ఇటీవ‌ల త‌న బేబి బంప్ గురించి వెల్ల‌డించిన‌ప్ప‌టి నుంచి ఎన్నో విశేషాల్ని అభిమానులు తెలుసుకుంటున్నారు. త‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసే ప్ర‌తి విష‌యాన్ని ఫ్యాన్స్ ఎగ్జ‌యిటింగ్ గా ప‌రిశీలిస్తున్నారు. కాజ‌ల్ క‌స‌ర‌త్తులు జాగ్ర‌త్త‌లు ఆహార నియ‌మాలు వ‌గైరా వ‌గైరా తెలుసుకున్నారు.

సౌత్ రీజనల్ ఎంటర్ టైన్ మెంట్ స్పేస్ లో తనవైన‌ సంచలనాల‌తో మిలియ‌న్ల హృదయాలను గెలుచుకున్న కాజల్.. వృత్తిపరమైన విజయానికి సంబంధించినంతవరకు ఎంతో పెద్ద ఎత్తుకు ఎదిగారు. త‌న న‌ట‌న అందం చొర‌వ‌ ఆమెకు కొత్త అవకాశాలను తెచ్చాయి.

ఇటీవ‌ల గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడారు. ఈ జంట అన్యోన్య‌త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇంత‌కుముందే గ‌ర్భ‌ధార‌ణ‌పైనా ఆ ఇద్ద‌రూ ప్ర‌క‌టించారు.

తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ తన బెస్ట్ ఫ్రెండ్ తో ప్రత్యేక ఫోటోను షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ ఎవ‌రీ బెస్ట్ ఫ్రెండ్? అంటే  ఫ్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఉప‌యోగించే ప్ర‌త్యేక‌మైన బీన్ బ్యాగ్ ఇది. అద‌నంగా బెడ్ పై వినియోగిస్తున్నారు.

దీనిని ఫ్రెగ్నెన్సీ పిల్లో అని కూడా పిలుస్తున్నారు. ఇది వినియోగించ‌డం వ‌ల్ల గ‌ర్భిణికి ఎంతో సౌక‌ర్యంగా ఉంటుంది. 1500  నుంచి ఆపై రూ.50 వేల‌ వ‌ర‌కూ ధ‌రను క‌లిగి ఉన్నాయి. చంద‌మామ కాజ‌ల్ ఇంత‌కీ ఏ బ్రాండ్ కి ప్ర‌చారం చేస్తోందో కానీ చాలా సౌక‌ర్య‌వంతంగా క‌నిపిస్తోంది. కాబోయే మ‌మ్మీకి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ప్ర‌పంచంలోనూ ఇప్పుడు బోలెడంత డిమాండ్ ఉందన్న‌ది స‌త్యం.
Tags:    

Similar News