2018లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనాలు సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 1'. యష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించి ట్రేడ్ వర్గాలని విస్మయపరిచింది. ఇంత వరకు ఏ కన్నడ సినిమా సాధించని సరికొత్త రికార్డుల్ని నెలకొల్పి సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా రానున్న మూవీ 'కేజీఎఫ్ చాప్టర్ 2'.
పిరియీడిక్ స్టోరీతో ఎమర్జెన్సీ నాటి కథగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరపై ఆవిష్కరించిన తీరు ఇండియన్ ప్రేక్షకులకు హాలీవుడ్ యాక్షన్ చిత్రాన్ని చూస్తున్న ఫీలింగ్ ని కలిగించింది. అంతే కాకుండా చాప్టర్ 1ని గరుడ హత్యతో ముగించడంతో చాప్టర్ 2 ఎలా వుండబోతోందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. దీంతో గత కొన్ని నెలలుగా ఈ మూవీ రిలీజ్ కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఈ మూవీని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించి రిలీజ్ డేట్ పోస్టర్ ని హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది.
అప్పటి నుంచి ట్రైలర్ కోసం, ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడాది క్రితం యష్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ని విడుదల చేసిన చిత్ర బృందం ట్రైలర్ ని మాత్రం గత కొన్ని నెలలుగా దాస్తూ వస్తోంది. ఎట్టకేలకు అభిమానుల ఒత్తిడి మేరకు మార్చి 27న విడుదల చేస్తామని ప్రకటించింది. మార్చి 25న 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ తరువాతే ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేస్తామని ఎందుకు ప్రకటించారో అభిమానులకు ఏ మాత్రం అర్థం కావడం లేదట.
ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ దగ్గరపడుతున్నా కొద్దీ మేకర్స్ ప్రచారాన్ని ఇప్పటికీ ప్రారంభించకపోవడం అభిమానులకు అసహనాన్ని తెప్పిస్తోంది. పాన్ ఇండియా మూవీకి పబ్లిసిటీ చేయకుండా మేకర్స్ సైలెంట్ గా వుంటున్నారని అభిమానులు కామెంట్ లు చేస్తున్నారు. అయితే మేకర్స్ మాత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు ఎలాంటి హంగామా అవసరం లేదని, సైలెంట్ గానే మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నారని తెలిసి అభిమానులు షాకవుతున్నారు.
తాజాగా దర్శకుడు ఓ వీడియోని విడుదల చేశారట. ట్రైలర్ ని మాత్రం ఈ నెల 27న గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తామని, యష్ ఇప్పుడు బిగ్ స్టార్ కాబట్టి 'కేజీఎఫ్ చాప్టర్ 2' కు పెద్దగా ప్రమోషన్స్ అవసరం లేదు' అని స్పష్టం చేశారట. ఇది ఇప్పుడు ఫ్యాన్స్ ని కలవరానికి గురిచేస్తోందట. ఫ్యాన్స్ మేకర్స్ ఈ మూవీ రిలీజ్ కోసం ప్రమోషన్స్ తో భారీ హంగామా చేయాలని భావిస్తుంటే మేకర్స్ మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ దీనికి అవసరం లేదని, లో ప్రొఫైల్ ని మెయింటైన్ చేయడమే బెటర్ అంటూ చెబుతుండటం ఫ్యాన్స్ ని అసహనానికి గురిచేస్తోందని చెబుతున్నారు.
మేకర్స్ అన్నట్టుగానే ప్రమోషన్స్ విషయంలో సైలెంట్ అవతారా? లేక 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ తరువాత ప్రమోషన్స్ జోరు పెంచేస్తారా? అన్నది తెలియాలంటే ట్రైలర్ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా వుంటే 'కేజీఎఫ్ చాప్టర్ 2' ఓటీటీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 సొంతం చేసుకుంది. ఇందు కోసం భారీ డీల్ ని ఫినిష్ చేసుకుంది హోంబలే ఫిలింస్.. దక్షిణ భారతీయ భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల్ని జీ5కి భారీ మొత్తానికి ఇచ్చేయడం విశేషం.