దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మ్యూజిక్ లేబుల్ లహరి మ్యూజిక్ సినీనిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతోంది. వీనస్ ఎంటర్ టైనర్స్ తో కలిసి లహరి ఫిల్మ్స్ LLP పేరుతో ఈ చిత్రాన్ని ప్రకటించింది. పాపులర్ నటుడు దర్శకుడు ఉపేంద్ర తో కలిసి పాన్ ఇండియా ఫిల్మ్ కోసం కలిసి పని చేయనుంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బెంగుళూరు ఆధారిత సంగీత లేబుల్ లహరి మ్యూజిక్ చలనచిత్ర నిర్మాణంలోకి ప్రవేశించడంతో అభిమానుల్లో ఇది చర్చగా మారింది.
ఉపేంద్ర ఈ చిత్రంలో హీరోగా నటిస్తారు. అలాగే దర్శకుడు ఆయనే. ఉపేంద్ర అంటేనే వెరైటీ. అతడి సినిమాల టైటిల్స్ అంతే వైవిధ్యంగా యూనివర్శల్ అప్పీల్ తో ఉంటాయి. అసాధారణ మూ టైటిల్స్ ష్ -A-ఓం- మొదలైన వాటితో ప్రజల హృదయాలను శాసించడం ద్వారా గొప్ప క్రేజ్ తెచ్చుకున్నాడు. ఉపేంద్ర చేసిన ఈ సినిమాలు జనాల మనసుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.
4 భాషల్లో అత్యంత భారీగా..కన్నడ- హిందీ- తెలుగు- తమిళం లో విడుదల చేసేందుకు అవసరమైన కంటెంట్ ని లహరి సంస్థ ఎంపిక చేసుకుంది. చాలా గొప్ప కంటెంట్ ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం ద్వారా మొత్తం భారతీయ ప్రేక్షకులను అలరించడానికి ఉపేంద్ర ప్రణాళికల్ని సిద్ధం చేసారు. బాహుబలి- KGF - పుష్ప ఇటీవల పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాయి. ఈ విజయాల తర్వాత అంత పెద్ద స్థాయిని అందుకోవాలని లహరి ఆశపడుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
లహరి మ్యూజిక్ గ్రూప్ ఛైర్మన్ కం మేనేజింగ్ డైరెక్టర్ జి మనోహరన్ మాట్లాడుతూ, "గత 25 సంవత్సరాలుగా సంగీతంపై ఒకరితో ఒకరు కలిసి పనిచేసాం. తరువాత కొంత కాలంగా మరో కొత్త తరహా అసోసియేషన్ కోసం ఎదురు చూస్తున్నాము. లహరి 'ఎ' నుండి ఉపేంద్ర జీకి మద్దతుగా ఉంది. ఈ కాంబినేషన్ దక్షిణాదిలో అతిపెద్ద విజయాన్ని సాధించింది. 90ల చివరలో కల్ట్ క్లాసిక్ గా ఎ చిత్రం నిలిచింది. విశ్వవ్యాప్త దృష్టితో నిండిన అతని చిత్రాలను మనం ఎల్లప్పుడూ ఆస్వాధించాం. మొత్తం భారతీయ ప్రేక్షకులు ఇప్పుడు భారతదేశం తో పాటు విదేశాలలో ఉపేంద్రజీ చిత్రాలను ఆస్వాధించాలని మేము కోరుకుంటున్నాము. యూనిక్ థాట్ తో సినిమాలు తీస్తాం" అని ప్రకటించారు.
అదే సమయంలో వీనస్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొప్రైటర్ శ్రీకాంత్ కెపి మాట్లాడుతూ, -'తగరు'-'సలగ' వంటి విజయవంతమైన బ్లాక్ బస్టర్ ల తర్వాత ప్రొడక్షన్ హౌస్ గా గత రెండు దశాబ్దాలుగా మేము అనేక స్థాయిలను చూశాము. ఆయనతో కలిసి ప్రాజెక్ట్స్ లో పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఉపేంద్ర జీ వంటి దూరదృష్టి గల చలనచిత్ర దర్శకునితో కలిసి పనిచేయడం ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ కొత్త పాన్ ఇండియా విజన్ ని మొత్తం దేశం ఇష్టపడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అన్నారు.
33 ఏళ్లుగా స్క్రీన్ ప్లే- డైలాగ్స్ అనుభవం ప్రతిభావంతుడైన దర్శకనటుడు ఉపేంద్ర మాట్లాడుతూ,- "పాన్ ఇండియా చిత్రం కోసం ఈ అద్భుతమైన కాంబినేషన్ తో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం మొత్తం భారతీయ ప్రేక్షకులకు వారు ఇష్టపడే సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఉపేంద్ర పేరుతో కథను రూపొందించాక.. నా అభిమానులు 33 సంవత్సరాలు స్క్రీన్ ప్లే లు డైలాగ్ లు నాతో రాయించారు. వారి ఈలలు- చప్పట్లు వినేందుకు వాటికి నేనే దర్శకత్వం వహించాను. ఈ చిత్రాన్ని భారతీయ సినీ అభిమానులకు ప్రజా ప్రభువులకు అంకితమిస్తున్నాను" అని అన్నారు.