ఎవరు అన్నా అనకపోయినా.. మెగాస్టార్ ఇండస్ట్రీకి పెద్ద అంతే. ఎందుకంటే ఆయన రేంజ్ అలాంటిది. ఆయన ఇండస్ట్రీకి చేస్తున్న సేవలు అలాంటివి. ఎన్టీఆర్, ఏ ఎన్నార్ ల తరం తరువాత తెలుగు సినిమా స్వరూపాన్నే మార్చారు చిరంజీవి, డాన్సుల్లో, ఫైట్స్ లో, మేనరిజమ్స్ లో వెండితెరపై విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. డిస్కో డాన్స్, బ్రేక్ డాన్స్ లని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత కూడా చిరంజీవిదే అందుకే ఆయన ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్.
ఇది మనం మాత్రమే అంటున్న మాట కాదు ఇతర భాషల హీరోలు, క్రేజీ స్టార్ లు ముక్త కంఠంతో చెబుతున్న మాట. తెలుగులో నెంబర్ వన్ హీరోగా దశాబ్దాల కాలం పాటు కొనసాగిన ఘనత కూడా ఆయనకే సొంతం. ఒక దశలో స్టార్ గా అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా రికార్డు సాధించారు. 80వ దశకం నుంచి ఆయన టాలీవుడ్ లో హవా అలా కొనసాగింది. ఎవరూ కూడా ఆయన స్థానానికి పోటీపడలేకపోయారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిరు స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి ప్రవేశించి హీరోలుగా మారిన వాళ్లు ఎందరో వున్నారు.
మెగాస్టార్ కు వీరాభిమానులుగా మారిన క్రేజీ స్టార్ లు కూడా వున్నారు. బహిరంగ వేదికలపై ఆ విషయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించడం విశేషం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్' మార్చి 25న విడుదలవుతున్న విషయం తెలిసిందే. రాజమౌళి భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం దేశ వ్యాప్తంగా ప్రమోషనల్ ఈవెంట్ లని జోరుగా నిర్వహిస్తున్న అభిమానుల్లో జోష్ ని నింపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం 'ఆర్ ఆర్ ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఢిల్లీలో భారీ స్థాయిలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళితో పాటు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియాభట్ లతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ పాల్గొన్నారు. హీరోలతో కలిసి నాటు నాటు సాంగ్ కి స్టెప్పులేసి సందడి చేశారు. అంతే కాకుండా చాలా జాలీగా గడిపారు. అయితే ఈ ఈవెంట్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి పై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్ హీరో అమీర్ ఖాన్ కు తాను పెద్ద ఫ్యాన్ ని అని అన్నారు. ఈ మాటలు విన్న అమీర్ ఖాన్ వెంటనే మైక్ తీసుకుని నేను ముందు నుంచే మీ నాన్న చిరంజీవికి వీరాభిమానిని అని చెప్పి షాకిచ్చారు. బహిరంగ వేదికపై చిరంజీవికి తాను పెద్ద ఫ్యాన్ ని అని అమీర్ ఖాన్ చెప్పడం విశేషం.
తాజాగా 'గాడ్ ఫాదర్' సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్న సల్మాన్ ఖాన్ తనకు ఎలాంటి పారితోషికం అవసరం లేదని, చిరు పక్కన నటించడమే పెద్ద రెమ్యునరేషన్ అని చెప్పారట. బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ హీరోలు చిరు గొప్పతనం గురించి చెబుతుంటే ఇది కదా మెగా స్టార్ చిరంజీవి అంటే.. ఇది కదా ఆయన అసలు రేంజ్ అంటే అని అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారట.