న‌ట్ట న‌డి వీధిలో ఈవిడ వీరంగ‌మేంటో?

Update: 2022-02-19 04:33 GMT
పూన‌మ్ పాండే.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. వివాదాలు ఒక వైపు .. వ‌రుస ఫోటోషూట్లు వీడియో షూట్లు మ‌రోవైపు ఈ అమ్మడిని నిరంత‌రం లైమ్ లై్ లో ఉంచుతాయి. ఇంత‌కుముండు నీలి చిత్రాల యాప్ ల కేసులో అరెస్ట‌యిన ప్ర‌ముఖుడితో వివాదం వ‌ల్ల కూడా పూన‌మ్ పేరు ప్ర‌ముఖంగా జాతీయ మీడియా హెడ్ లైన్స్ లోకి వ‌చ్చింది.

తాజాగా పూన‌మ్ షేర్ చేసిన జాగింగ్ ఫోటోషూట్ కుర్రాళ్ల గుండెల్లో మంట‌లు పుట్టించింది. ఒంటిపై వ‌లువ‌లు వ‌లిచేసి పందేరం వేసేందుకు ఏమాత్రం సిగ్గుప‌డ‌ని ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త భిన్నంగా ఒళ్లంతా క‌వ‌ర‌ప్ చేసుకుని కూడా అంతే హీట్ పుట్టించింది. అలా జాగింగ్ ట్రాక్ లో వెళుతూ పింక్ టాప్ తో దుమ్ము లేపింది. అయితే అలా జాగింగ్ కానిచ్చి కాఫీ కోసం వెళ్లిన పూన‌మ్ ని క్యాచ్ చేసారు ముంబై ఫోటోగ్రాఫ‌ర్లు. కాఫీ కోసం వీధిలోకి వెళితే గుండె గుభేల్! అంటూ దీనిపై కుర్ర‌కారు వ్యాఖ్యానిస్తున్నారు. వైర‌ల్ భ‌యానీ షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్స్ క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి.

పూన‌మ్ గ‌త వివాదాల్లోకి వెళితే..

డ్ర‌గ్స్ రాకెట్ ద‌ర్యాప్తు త‌ర్వాత బాలీవుడ్ ని అట్టుడికిస్తున్న సంచ‌ల‌న కేసుగా బాంబే డైయింగ్ రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల‌ వ్య‌వ‌హారం దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ర‌క‌ర‌కాల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  అందులో ప‌లువురు శృంగార నాయిక‌లు ఉన్నారు. శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా నివాసంలో సోదాల‌లో సుమారు డెబ్బై పోర్న్ వీడియోలను స్వాధీనం చేసుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఈ కేసును లోతుగా విచారిస్తుంటే కొంతమంది నటీమణుల గురించిన న‌గ్న‌స‌త్యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ కేసులో ఇత‌ర నాయిక‌ల్లానే పూనమ్ పాండే ఒకరు. వాస్తవానికి పూనమ్ 2019లో ఓసారి రాజ్ కుంద్రా వ్య‌వ‌హారాల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కానీ అప్పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కేసును మాఫీ చేసారు. మేనేజ్ చేశారు. ఆ త‌ర్వాత‌రాజ్ కుంద్రా అరెస్టు నేప‌థ్యంలో పూన‌మ్ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు.

తాను 2019 లో కేసు నమోదు చేశానని ఎవరూ త‌న మాట విన‌లేద‌ని.. క‌నీస‌ మద్దతు ఇవ్వలేదని.. కానీ ఇప్పుడు చాలా మంది నటీమణులు సహాయం కోసం ముందుకు వస్తున్నారని పూనం చెప్పారు. రాజ్ కుంద్రా అతని బృందంపై 2019 లో దాఖలు చేసిన కోర్టు కేసుపై పూన‌మ్ మాట్లాడింది. అభ్యంత‌ర‌క‌ర ఒప్పందంపై సంతకం చేయమని కుంద్రా టీమ్ ఆమెను కోర‌గా  ఆమె నిరాకరించ‌గా.. వ్యక్తిగత మొబైల్ నంబర్ ని లీక్ చేస్తామ‌ని బెదిరించార‌ని పూన‌మ్ చెప్పారు.

వాళ్లు నా వ్యక్తిగత ఫోన్ నంబర్ లీక్ చేసారు. ఇది ఏ అమ్మాయికి జ‌ర‌గ‌కూడ‌నిది. నేను పరారీలో ఉన్నాను. యాసిడ్ దాడితో సహా నాకు చాలా బెదిరింపుల మెసేజ్ లు పెట్టారు. ఆ తర్వాత ఆమె కేసు వేసినప్పుడు ఎవరూ తనను సమర్థించలేదని పూన‌మ్ గుర్తు చేసుకుంది.

ఈ కేసు విష‌యంలో చర్యలు తీసుకుంటే చాలా మంది బాలికలను దోపిడీ నుండి కాపాడిన వార‌మ‌వుతామ‌ని అంది పూన‌మ్. తాను అనుభవించిన బాధ‌ల‌ను ఆవేద‌న‌ను ఇంకెవ‌రూ అనుభవించకూడదని ఆమె అన్నారు. మౌనంగా బాధపడుతున్న వారు బయటకు వచ్చి స్వరం పెంచాలని పూనమ్ కోరారు. రెండేళ్ల క్రితం నా నంబర్ లీక్ అయినప్పుడు నేను దాఖలు చేసిన కోర్టు కేసులో నన్ను చాలా వేధించారు. నా ప్రైవేట్ విషయాలు చాలా లీక్ అయ్యాయి.. అని పూన‌మ్ నివేదించారు.

గ‌త వివాదం మ‌రువ‌లేరు:

మ‌రో కోణంలో చూస్తే అప్ప‌ట్లో  పూన‌మ్ పై ర‌క‌ర‌కాల వివాదాలు సంచ‌ల‌నంగా మారాయి. ఇంత‌కుముందు కెనకోనా జిల్లాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించినందుకు పూనమ్ పాండేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కలాంగూట్ పోలీసు బృందం పాండేను అదుపులోకి తీసుకుని తరువాత ఆమెను ప్రశ్నించడానికి కెనకోనా పోలీసులకు అప్పగించ‌గా.. అనంత‌రం పోలీసుల సుదీర్ఘ ఇంట‌రాగేష‌న్ కొన‌సాగింది.

ఈ కేసులో పూన‌మ్ టీమ్ కి అనుమతించినందుకు ఇన్స్ పెక్ట‌ర్  సహా ఇద్దరు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. డ్యామ్ వద్ద వివాదాస్పద వీడియోను చిత్రీకరించడానికి స‌ద‌రు శృంగార తార‌కు అనుమతి ఇచ్చినందున పోలీసులు కొంతవరకు తప్పుదోవ పట్టించారని క‌థ‌నాలొచ్చాయి.  వివాదాస్పద ఫోటోషూట్ కు సంబంధించి ఆమెపై దాదాపు అరడజను రాతపూర్వక ఫిర్యాదులు అంద‌గా పోలీసులు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 294 (అశ్లీలత) కింద పాండేపై కేసు నమోదు చేశారు. చపోలి ఆనకట్టను నిర్వహించే రాష్ట్ర జల వనరుల శాఖ ఫిర్యాదులలో ఒక ఫిర్యాదు న‌మోదైంది. పూనమ్ పాండే వీడియో గోవాలో రాజకీయ తుఫానుకు దారితీసింది. ఈ సంఘటన రాష్ట్రంలో పొలిటిక‌ల్ టర్న్ తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.




Tags:    

Similar News