పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''రాధేశ్యామ్''. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ పీరియాడికల్ డ్రామాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే వీటిల్లో ప్రభాస్ - పూజా జంట వ్యవహరిస్తున్న తీరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
'రాధేశ్యామ్' రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను మొన్న బుధవారం ముంబయిలోని పీవీఆర్ లో గ్రాండ్ గా నిర్వహించారు. అలానే ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో నిన్న ప్రెస్ మీట్ జరిగింది. అయితే ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా ప్రభాస్-పూజా సన్నిహితంగా ఉన్నట్టు కనిపించలేదు. ఇద్దరూ పక్కపక్కనే ఉన్నా ఒకరికొకరు ఐ కాంటాక్ట్ ఇచ్చుకోకపోవడం.. కనీసం హగ్ కూడా చేసుకోకపోవడం అందరిని ఆశ్చర్య పరిచింది.
వాస్తవానికి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రభాస్ - పూజా మధ్య విభేదాలు తలెత్తాయని ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. అప్పటి నుంచి రాధేశ్యామ్ జోడీ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పక్కపక్కనే కూర్చోవడం.. ఒకరి గురించి ఒకరు మంచి మాటలు చెప్పడంతో ఇద్దరి మధ్య అంతా ఓకే అనుకున్నారు.
కానీ ఇప్పుడు ప్రమోషన్స్ లో ప్రభాస్ - పూజా హెగ్డే వ్యవహార శైలి అప్పటి ఊహాగానాలకు ఊతమిచ్చేలా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో 'రాధేశ్యామ్' ప్రచారం శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో హీరోహీరోయిన్లు ఒకరినొకరు చేసుకొని నవ్వుకోకపోవడం.. హగ్గులు ఇచ్చుకోకపోవడం.. ఫోటోలు దిగేటప్పుడు చేతులు కూడా టచ్ అవ్వకుండా నిలబడటం గమనార్హం.
ముంబైలో ఈవెంట్ అప్పుడప్పుడు ప్రభాస్ - పూజా ఇద్దరూ జేబుల్లో చేతులు పెట్టుకుని ఫోటోలకు పోజులు ఇచ్చారు. చెన్నై ప్రెస్ మీట్ లోనూ అలానే వ్యవహరించారు. అన్ని ఫొటోలలో మొక్కుబడిగా పక్కపక్కనే నిలబడుతున్నట్లు.. ఇష్టం లేకుండా తప్పదన్నట్టు బలవంతంగా కూర్చున్నట్లు అనిపించింది. ఇంటర్వ్యూల్లో ఒకరి గురించి ఒకరు స్పందించే తీరు కూడా కాస్త భిన్నంగానే ఉంది.
ఇద్దరూ కలిసి జ్యోతిష్యం చూయించుకున్నా వారి మధ్య దూరం ఉందని అనుకునేలా ఉంది రాధేశ్యామ్ జంట వ్యవహార శైలి. దీంతో అసలు షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు ఇలా ఎడమోహం పెడమొహంగా ఉన్నారు? అని అభిమానులు ఆలోచిస్తున్నారు.
ప్రభాస్ మొదటి నుంచీ హీరోయిన్లతో దూరంగా ఉంటుంటారు. అందుకే వీలైనంత వరకు రొమాంటిక్ సీన్స్ లేకుండా చూసుకుంటూ ఉంటారు. తనతో బాగా క్లోజ్ అయిన వారితో మాత్రం చనువు చూపిస్తారు.. సరదాగా మాట్లాడతారు.
అయినప్పటికీ మిగతా హీరోయిన్లతో కూడా బాగానే మాట్లాడతారు. కానీ పూజాహెగ్డే విషయంలో మాత్రం డార్లింగ్ కాస్త భిన్నంగా ఉంటున్నారని 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ చూస్తే అర్థం అవుతుంది. ప్రభాస్ - పూజా హెగ్డే దగ్గరగా దూరంగా అన్నట్లు ఉండటానికి కారణమేంటమేది వారిద్దరికే తెలియాలి.
కాగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఎమోషనల్ పీరియాడికల్ లవ్ స్టోరీగా ''రాధేశ్యామ్'' సినిమా తెరకెక్కింది. ఇందులో హస్త సాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్ నటించారు. ప్రభాస్ పాత్ర అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోందని అంటున్నారు. విధికి, ప్రేమకు మధ్య జరిగిన యుద్ధంలాగా ఈ చిత్రాన్ని మేకర్స్ అభివర్ణిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా 'రాధేశ్యామ్' చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ చైనీస్ మరియు జపనీస్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.