రంగుల ప్రపంచంలో సెంటిమెంట్లకు కొదవేమీ లేదు. ఇక్కడ సంఖ్యాశాస్త్రాన్ని (న్యూమరాలజీ) బలంగా నమ్ముతారు. పేరు మార్పుతో విజయం తమను చేరుతుందని ఆశిస్తారు. ఇంతకుముందు తమన్నా.. సాయి ధరమ్ తేజ్ .. వైష్ణవ్ తేజ్ వంటి వారు పేరులో మార్పును ఆహ్వానించారు. ఒక అక్షరాన్ని కలపడమో లేదా పదాన్ని తీసివేయడమో చేశారు. తమన్నాకి ఈ మార్పు కలిసొచ్చింది. అయితే సాయి తేజ్ కి కానీ వైష్ణవ్ తేజ్ కి కానీ ఇది కలిసి రాలేదు. కేవలం ప్రతిభ మాత్రమే ఆ ఇద్దరినీ ఆదుకుంటోంది. చాలా మంది స్టార్ కిడ్స్ తమ తల్లిదండ్రులలాగా స్టార్స్ అవ్వకపోవడానికి కారణాల్ని విశ్లేషించుకుంటే చాలా విషయాలు ఉంటాయని అర్థమవుతుంది.
ఇప్పుడు శతాధిక చిత్రాల కథానాయకుడు రోషన్ కూడా సెంటిమెంటును ఫాలో అవుతున్నాడు. నిర్మలా కాన్వెంట్- పెళ్లిసందడి వంటి సినిమాలతో బాలనటుడిగా హీరోగా రెండుసార్లు రంగప్రవేశం చేసిన సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ టాలీవుడ్ లో ఛామింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ నటుడిగా అతను సాధించిన ప్రశంసలు ఓకే కానీ తనకు స్టార్ ఇమేజ్ రావడం అంత సులువుగా లేదు. కారణం ఏదైనా కానీ.. రోషన్ ఇప్పుడు తన పేరు స్పెల్లింగ్ ను రోషన్ గా మార్చుకున్నాడు. సంఖ్యాశాస్త్రవేత్తల సలహా ప్రకారం అదనపు 'n'ని పేరుకి జోడించాడు. ఇది అతడికి కలిసొస్తుందనే అంతా భావిస్తున్నారు. అయితే రోషన్ ఇంకా రెండు సినిమాల కిడ్ మాత్రమే. అతడు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. తన తండ్రి శ్రీకాంత్ ఆరంభం విలన్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి తర్వాత హీరో అయ్యి మెగా కాంపౌండ్ అండదండలతో నిలదొక్కుకున్నాడు. ఈ జర్నీ ఎంతో పెయిన్ ఫుల్. కానీ రోషన్ కి అందుకు ఆస్కారం లేదు.
ఇక తమన్నా.. వైష్ణవ్ తేజ్ వంటి వాళ్లు తమ పేరుకు ఒక అక్షరాన్ని అదనంగా చేర్చుకోగా అప్పట్లో చర్చనీయాంశమైంది. యాంకర్ కం డైరెక్టర్ ఓంకార్ న్యూమరాలజీని నమ్మి సక్సెసయ్యాడు. కానీ ఇది అందరికీ వర్కవుటవుతుందా? అన్నది సందేహమే. సాయి ధరమ్ తేజ్ తన పేరు నుండి ధరమ్ ని తీసివేసినా సాయిధరమ్ అనే ఎక్కువ మంది పిలుస్తున్నారు. ప్రస్తుతం రోషన్ .. షార్ట్ ఫిల్మ్ మేకర్ ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
జాతీయ అవార్డ్ దర్శకుడితో శ్రీకాంత్ వారసుడు
శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ వారసుడు రోషన్ చిత్రానికి జాతీయ అవార్డు విజేత.. దర్శకుడు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించనున్నారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్నసినిమాస్ నిర్మిస్తున్న 9వ చిత్రమిది. నేడు రోషన్ బర్త్ డే సందర్భంగా బ్యానర్ శుభాకాంక్షలు తెలిపింది. యువహీరో రోషన్ కెరీర్ బావుండాలని వైజయంతి మూవీస్ ఆశీస్సులు అందించింది.
'పెళ్లిసందD' తర్వాత రోషన్ కొంత గ్యాప్ తీసుకుని ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ వారసుడు రోషన్ హీరోగా రంగ ప్రవేశం చేసి రెండు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే పెళ్లి సంద-డి చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రోషన్-శ్రీలీల జంటగా నటించిన 'పెళ్లిసందD' దసరా కానుకగా రిలీజ్ అయి యావరేజ్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. రివ్యూల పరంగా నెగిటివ్ టాక్ వచ్చినా రిలీజ్ లు లేకపోవడంతో 'పెళ్లిసందD' సక్సెస్ తో గట్టెక్కిందని కథనాలొచ్చాయి. రోషన్- శ్రీలీల జంట నటనకు మంచి పేరొచ్చింది.
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా లాభాలు బాగానే తెచ్చిపెట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా కొన్ని రోజుల పాటు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిచింది. ఆ రకంగా యంగ్ హీరో రోషన్ ఖాతాలో తొలి సక్సెస్ నమోదైంది. యాక్టింగ్ పరంగానూ బెటర్ మెంట్ చూపించాడు యంగ్ బోయ్. అయితే ఈ సినిమాలో కిల్లింగ్ బెంగుళూరు బ్యూటీ శ్రీలీల నటన హైలైట్. ముఖ్యంగా తనలో మంచి డాన్సర్ ఉందని నిరూపించింది.
శ్రీకాంత్ వారసుడిగా రోషన్ కెరీర్ కి ఎలాంటి డోఖా ఉండదనడంలో సందేహం లేదు. శ్రీకాంత్ .. మెగాస్టార్ కి సోదరుడితో సమానం. మెగా - అక్కినేని టాప్ హీరోల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అయితే తనని స్టార్ లీగ్ లోకి తీసుకెళ్లేందుకు హీరో శ్రీకాంత్ మరింతగా ప్లానింగ్ కి రూపకల్పన చేయాల్సి ఉంటుంది. 'పెళ్లిసందD' తర్వాత రోషన్ ప్లానింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తిని ఫ్యాన్స్ కనబరిచారు. వైజయంతి లాంటి పెద్ద బ్యానర్ లో సినిమా చేయడం రోషన్ కి పెద్ద ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. టాలీవుడ్ లో మహేష్ - అఖిల్ తరహాలోనే ఛామింగ్ హీరోగా పేరుంది. మునుముందు రోషన్ సినీవినీలాకాశంలో దూసుకెళ్లేందుకు ఆస్కారం లేకపోలేదు.