బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కబీర్ సింగ్ సినిమాకు ముందు 20 కోట్లకు కాస్త అటు ఇటు పారితోషికం తీసుకునేవాడు. కాని కబీర్ సింగ్ సక్సెస్ అవ్వడంతో అనూహ్యంగా ఆయన పారితోషికం అమాంతం పెరిగింది. కబీర్ సింగ్ లో ఆయన నటన అభిమానులను పెంచడం మాత్రమే కాకుండా ఆయన స్థాయిని పెంచింది. వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న షాహిద్ కపూర్ ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా జెర్సీ సినిమా తో రాబోతున్నాడు.
షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన జెర్సీ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దాదాపుగా 150 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది. కరోనా వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీకి ఈ జెర్సీ రీమేక్ అనే విషయం తెల్సిందే. జెర్సీ రీమేక్ లో షాహిద్ కపూర్ లుక్ మరియు యాక్షన్ విడుదలకు ముందే మంచి టాక్ ను దక్కించుకుంది. ఈ రీమేక్ ను తెలుగు నిర్మాతలు అయిన దిల్ రాజు.. అల్లు అరవింద్ మరియు నాగ వంశీలు కలిసి నిర్మించారు. ఈ సినిమా కోసం షాహిద్ కపూర్ దాదాపుగా 32.5 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
జెర్సీ సినిమా తెచ్చిన క్రేజ్ తో షాహిద్ కపూర్ తన పారితోషికంను మరింత గా పెంచాడనే వార్తలు వస్తున్నాయి. జెర్సీ సినిమా విడుదల కాకుండానే తదుపరి సినిమాకు కమిట్ అయిన షాహిద్ కపూర్ ఏకంగా తన పారితోషికంను 40 కోట్లకు పెంచాడని వార్తలు వస్తున్నాయి. 20 కోట్లు ఉన్న షాహిద్ కపూర్ రెమ్యూనరేషన్ ఇప్పుడు 40 కోట్లకు చేరింది అంటే ఖచ్చితంగా మన రెండు తెలుగు సినిమాల వల్లే అనడంలో సందేహం లేదు.
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ కబీర్ సింగ్ అనూహ్యంగా షాహిద్ కపూర్ ను స్టార్ గా మార్చేసింది. ఆ తర్వాత జెర్సీ సినిమా కూడా ఈ బాలీవుడ్ హీరో పాలిట కాసుల వర్షం కురిసేలా చేసింది అనడంలో సందేహం లేదు. ముందు ముందు ఈ యంగ్ బాలీవుడ్ హీరో మరిన్ని తెలుగు సినిమాలను రీమేక్ చేసి బాలీవుడ్ లో సక్సెస్ ను దక్కించుకుని సూపర్ స్టార్ అవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.