బాలీవుడ్ వణికిపోతోంది. రాజ్ కుంద్రా ఎపిసోడ్ తో వారు కక్కాలేకా.. మింగాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉరిమి ఉరిమి మంగలం మీద పడ్డట్లు అన్న సామెతకు తగ్గట్లుగా మారింది రాజ్ కుంద్రా వ్యవహారం. బూతు సినిమాల్ని చేయటం.. దాన్ని యాప్ లో విడుదల చేయటం ద్వారా భారీఆర్జనకు అతగాడు వేసిన ఎత్తులు ఇప్పుడు బయటకు వచ్చి షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. అతగాడికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.
మరోవైపు ముంబయి పోలీసులు ఈ వ్యవహారంపై మరింత పట్టు సాధించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పుణ్యమా అని రాజ్ కుంద్రాతో మొన్నటి వరకు స్నేహం ఉన్నందుకు సంతోషంగా ఫీల్ అయిన వారు.. ఇప్పుడు అతగాడి మాట ఎత్తితే చాలు.. వణికిపోతూ.. తమకు సంబంధం లేదంటే లేదంటూ తేల్చి చెప్పేస్తున్న పరిస్థితి.
బూతు వీడియోలు చేయటం.. అందులో నటించే నటీమణుల్ని ట్రాప్ చేసి.. వారిని బెదిరించి వీడియోలు చేస్తున్నట్లుగా వచ్చిన ఫిర్యాదులు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న ముంబయి పోలీసులు.. దీని లెక్క తేల్చేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. రాజ్ కుంద్రాతో సంబంధం ఉన్న వారందరిని విచారించాలన్న యోచనలోఉన్నట్లు చెబుతున్నారు. దీంతో..బాలీవుడ్ ప్రముఖులకు ఇప్పుడు గొంతులో ఎలక్కాయ పడినట్లైంది.
శిల్పా శెట్టి భర్తగా సుపరిచితుడు.. వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా సర్కిల్ పెద్దదే. భార్య ప్రముఖ నటి అయినప్పడు ఆటోమేటిక్ గా వచ్చే పరిచయాలు అంతో ఇంతో సన్నిహితం చేస్తాయి. అలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నవారు మొదలు..ఒక మెస్తరు పరిచయం ఉన్న వారు సైతం ఇప్పుడు గజగజలాడుతున్నారు. ఈ ఇష్యూలో తమకు లింకు లేకున్నా.. మీడియాలోకానీ సోషల్ మీడియాలో కానీ ఏ మాత్రం ప్రస్తావన వచ్చినా.. తమకు జరిగే నష్టం అంతా ఇంతా అన్నట్లు ఉండదని వాపోతున్నారు.
గ్లామర్ ఇండస్ట్రీలో పాజిటివ్ ఎంతలా పని చేస్తుందో.. నెగిటివ్ మాట ఒక్కటి చాలు.. దారుణంగా డ్యామేజ్ చేయటానికి. రాజ్ కుంద్రా ఎపిసోడ్ లో ఎవరి పేరైనా పొరపాటున ప్రచారంలోకి వస్తే చాలు.. ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అన్నట్లు మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానిజాల గురించి ఎవరూ పట్టించుకోరు. ముందైతే వెనుకా ముందు చూసుకోకుండా బద్నాం చేస్తారు. రేపొద్దున కోర్టులు శుద్దపూస అని తేల్చినా.. అప్పటికి జరిగే నష్టం భరించలేనంత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే.. రాజ్ కుంద్రా పరిచయాన్ని.. స్నేహాన్ని ఒక పీడకలగా భావిస్తున్న వారు.. ఇకపై ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని కొందరు ప్రముఖులు ప్రతిన బూనినట్లుగా చెబుతున్నారు.