పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -రానా దగ్గుబాటి కాంబినేషన్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ ఓటీటీ విడుదలకు డేట్ ఫిక్సయ్యింది. ఈ సినిమా ఇప్పటికే మూడు వారాల రన్ ని కొనసాగించింది. ఇప్పటికీ నాలుగో వారంలో థియేటర్లలో అలరిస్తూనే ఉంది. ఇంతలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించడం ఆసక్తికరం.
గత సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న గ్రాండ్ గా విడుదైలంది. భీమ్లా నాయక్ తెలుగు ఓటీటీ హక్కులను ఆహా సంస్థ దక్కించుకుంది. హిందీ డబ్బింగ్ హక్కులను హాట్ స్టార్ డిస్నీ ప్లస్ భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే భీమ్లా నాయక్ రెండు OTT ప్లాట్ ఫారమ్ లలో ఒకేసారి సందడి చేయబోతోందని ఇంతకుముందే టాక్ వినిపించింది. సినిమా థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాలకే OTTలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మార్చి 25న భీమ్లా నాయక్ OTTలో విడుదలవుతోంది. అభిమానులు మరోసారి ఆహాలో డిస్నీ హాట్ స్టార్ లో వీక్షించేందుకు ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. 120 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్టు కొట్టింది.
ఈ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసాఫీసర్ గా అదరగొట్టగా.. ఈగోయిస్టిక్ పెద్ద మనిషి పాత్రలో రానా అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఇద్దరికీ మంచి పేరొచ్చింది. OTT శాటిలైట్ ద్వారా చిత్ర నిర్మాతలకు భారీ లాభాలు దక్కాయి. ఆ మార్గంలో పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా రికవరీ అయినట్లు సమాచారం. నాన్ థియేట్రికల్ గా చూస్తే భీమ్లా నాయక్ చక్కని ఆదాయాల్ని తెచ్చిందన్న టాక్ ఉంది.
డ్యూటీ ఎక్కేస్తాడు! అంటూ తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేయగా అభిమానుల్లో మరోమారు ఉత్సాహం నెలకొంది. ఈ శుక్రవారం ఈ టైమ్ కి పవర్ స్టార్మ్ మన ఇంటికి వచ్చేస్తోంది. @ahavideoIN lo డేట్స్ మార్క్ చేసుకుని క్యాలెండర్ ఖాళీగా ఉంచుకుందాం.. అంటూ అభిమానులు జోరు ప్రదర్శిస్తున్నారు.
అన్నట్టు మార్చి 25న మోస్ట్ అవైటెడ్ ఆర్.ఆర్.ఆర్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా థియేటర్లలో విడుదలుతోంది. అదేరోజు ఆహా! లో భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ అవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ కి పోటీగా భీమ్లా డ్యూటీకి దిగేస్తున్నాడని అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.