కొత్త తరహా చిత్రాలతో హీరోగా తన కంటూ ప్రత్యేకతని చాటుకుంటున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తొలి చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందించలేకపోయినా హీరోగా మాత్రం తనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. రెండవ సినిమా `ఎస్. ఆర్. కల్యాణ మండపం` కిరణ్ అబ్బవరంకు మంచి సక్సెస్ ని అందించి ఇండస్ట్రీ వర్గాల దృష్టితో పాటు ప్రేక్షకుల్లో గుర్తింపుని అందించింది. ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ లో వున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మూడు చిత్రాలలో నటిస్తూ బిజీగా వున్నాడు. తాజాగా `సెబాస్టియన్ పీసీ 524` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
బాలాజీ సయ్యపురెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 4న విడుదలైంది. రేచీకటితో బాధపడే ఓ పోలీస్ కానిస్టేబుల్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంపై కిరణ్ అబ్బవరం మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా కనిపిచారు. సరికొత్త నేపథ్యం, క్యారెక్టర్ కూడా కొత్తగా వుండటంతో సినిమా ఎలాగైనా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని భావించారు కిరణ్. కానీ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఫలితం ఆశించిన స్థాయిలో రాలేదు.
ప్రచార కార్యక్రమాల్లో కిరణ్ అబ్బవరం మాట్లాడిన తీరు, ఎస్. ఆర్ . కల్యాణ్ మండపం సాధించిన విజయం కారణంగా `సెబాస్టియన్ పీసీ 524` పై బజ్ క్రియేట్ అయింది.
అయితే అది పూర్తి స్థాయిలో సినిమాకు ప్లస్ గా మారలేకపోయింది. కారణం ఈ చిత్రాన్ని రాంగ్ టైమ్ లో రిలీజ్ చేయడమే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కిరణ్ అబ్బవరం ఈ మూవీపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అదే కాన్ఫిడెన్స్ తో బరిలో భారీ క్రేజీ చిత్రాలున్నా అతి నమ్మకంతో విడుదల చేశారు. అదే ఫలితాన్ని తారు మారుచేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ మూవీ రిలీజ్ కిముందే పవక్ ప్టార్ పవన్ కల్యాణ్ నటించిన `భీమ్లానాయక్` విడుదలైంది. ఆ తరువాత శర్వానంద్ నటించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` థియేటర్లలోకి వచ్చేసింది. ఈ రెండు చిత్రాల మధ్యలో సెబాస్టియన్ చిత్రాన్ని విడుదల చేయడమే తాజా ఇబ్బందికి కారణంగా మారింది. ఈ విషయాన్ని గమనించకుండా విడుదల చేసిన `సెబాస్టియన్ పీసీ 524`కి బి,సి సెంటర్లలో బిగ్ సాక్ తగిలింది. కొన్ని థియేటర్లలో ఈ సినిమాకు రూ. 1000.. 2000 గ్రాస్ రావడం షాకిస్తోంది.
కిరణ్ అబ్బవరం కొత్త తరహా కథల్ని ఎంచుకుంటున్నా అలాంటి చిత్రాలని సరైన టైమ్ లో రిలీజ్ చేయకపోవడం వల్లే తాజా ఫలితం ఎదురైందని, ఇకపై అయినా ఇలాంటి సందర్భాల్లో తన సినిమాలని విడుదల చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కొంత మంది కిరణ్ అబ్బవరం శ్రేయోభిలాషులు చెబుతున్నారు.