MCA నాని కెరీర్ లో యావరేజ్ హిట్. అక్క తమ్ముడు సెంటిమెంట్ తో రూపొందిన ఈ చిత్రంలో నాని - భూమికల నటన .. కుటుంబ అనుబంధాలు.. సెంటిమెంట్లు వగైరా తెలుగు ఆడియెన్ లో వర్కవుట్ అయ్యాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లను సాధించింది. కానీ ఇదే సినిమాని హిందీలో `నికమ్మ` పేరుతో రీమేక్ చేస్తే అక్కడ తిరస్కరణకు గురైంది. నికమ్మ గత శుక్రవారం విడుదలైంది. దురదృష్టవశాత్తు విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని తిరస్కరించారు.
ఇండియాలో ఈ సినిమా తొలిరోజు 50 లక్షలు మాత్రమే వసూలు చేయడంతో కలెక్షన్ల స్థాయి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. కోట్లాది రూపాయల బడ్జెట్ తో యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కినా కొత్త హీరో కావడంతో పేలవమైన ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఈ వారాంతంలో ప్రజలను థియేటర్లకు రప్పించడంలో మూవీ విఫలమైంది.
ఈ చిత్రంతోనే ప్రముఖ నటి భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో అతడు నాని పాత్రను పోషించగా.. భూమిక పాత్రను శిల్పాశెట్టి పోషించింది. ఈ చిత్రానికి సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. కానీ తానొకటి తలిస్తే అన్న చందంగా నటవారసుడి తొలి ప్రయత్నం విఫలమైంది.
కన్నీళ్లు పెట్టుకున్నా ప్రేక్షకులు కరగరు!
నటవారసుడిని హీరోగా తెరకు పరిచయం చేస్తూ నటి భాగ్యశ్రీ ఎమోషన్ అవ్వడం ఇటీవల ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ``యే నికమ్మా బడా కామ్ కా హై`` అంటూ భాగ్యశ్రీ తన కొడుకు అభిమన్యు దాసాని గురించి వర్ణించేస్తూ ఎమోషనల్ అయ్యారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా భాగ్యశ్రీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన కొడుకు సినిమా కోసం చాలా కష్టపడ్డాడని చెప్పారు. అభిమన్యు పూర్తి అంకితభావంతో పనిచేశారని అందరి హృదయాల్లో స్థానం సంపాదించాలని తాను కోరుకుంటున్నానని భాగ్యశ్రీ అన్నారు.
ట్రైలర్ లాంచ్ లో భాగ్యశ్రీ అందరినీ కంటతడి పెట్టించింది. మా అబ్బాయి అద్భుతంగా పని చేసాడా? అంటూ ట్రైలర్ లాంచ్ లో ఆడియెన్ ని ప్రశ్నించారు భాగ్యశ్రీ. ఈ సినిమా కోసం అభి చాలా ఎఫర్ట్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కోవిడ్-19 సమయంలో రెండేళ్లపాటు శ్రమించారు. నికమ్మ కోసం అందరూ థియేటర్లకు రావాలి . థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని భావించాం`` అని అన్నారు.
కొడుకు అభిమన్యు దాసానిని పొగిడేస్తూనే భాగ్యశ్రీ కాస్త షేక్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఆమె కన్నీళ్లకు ప్రేక్షకులు కరగలేదు.