నితిన్ తో వ‌క్కంతం బ‌స్తీ మే స‌వాల్?

Update: 2022-11-27 05:33 GMT
యూత్ స్టార్ నితిన్ కి `ఇష్క్ - గుండె జారి గ‌ల్లంతైందే- భీష్మ‌` లాంటి మ‌రో బంప‌ర్ హిట్ ప‌డాల్సిన సంద‌ర్భ‌మిది. గత చిత్రం మాచర్ల నియోజక వర్గం థియేటర్లలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

 దీంతో యువ‌హీరో ఓకింత నిరాశ చెందాడు. ఇటీవ‌ల‌ చిన్న విరామం తీసుకుని తిరిగి వ‌స్తున్నాడు. నితిన్ న‌టించే 32వ సినిమా (నితిన్ 32) షూటింగ్ ని ఇటీవ‌ల ప్రారంభించాడు.

ఏప్రిల్ 2022లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా ఎట్టకేలకు మారేడుమిల్లి అడవిలో మొదటి షెడ్యూల్ తో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ రైట‌ర్ వక్కంతం వంశీ దర్శకుడు కావ‌డం ఆస‌క్తిక‌రం.

ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల నితిన్ తో రొమాన్స్ చేయనున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ లాంటి ప్ర‌తిభావంత‌మైన‌ సంగీత దర్శకుడిని ఎంపిక చేసారు.

హారిస్ రాక‌తో నితిన్ - వ‌క్కంతం సినిమాకి అద‌న‌పు బ‌లం యాడైంది. అత‌డి రీరికార్డింగ్ .. ట్యూన్స్ కచ్ఛితంగా యూనిక్ నెస్ ని కొత్త ఫీల్ ని తెస్తాయ‌న‌డంలో సందేహం లేదు.

 మ్యూజిక్ తోనే స‌గం హిట్టు గ్యారెంటీ. ఇక `నా పేరు సూర్య` లాంటి టిఫిక‌ల్ థీమ్ లైన్ తో సీరియ‌స్ సినిమా తీసిన వ‌క్కంతం బ‌న్నీతో ఆశించిన విజ‌యం అందుకోలేక‌పోయారు. కానీ ఆ సినిమా బుల్లితెర‌పై వీక్షించే వారికి స్పెష‌ల్ ట్రీట్ గా అనిపించింది. బ‌ల‌మైన వ్య‌క్తిత్వం ఉన్న ఆర్మీ మేన్ గా బ‌న్నీ సీరియ‌స్ రోల్  .. అర్జున్ తో అత‌డి కాన్ ఫ్లిక్ట్  ఆద్యంతం మెస్మ‌రైజ్ చేస్తుంది. కానీ ఆ సినిమాలో కామెడీ రొమాన్స్ అంశాలు మిస్స‌య్యాయి. వేడెక్కించే పాట‌ల‌కు తావు లేదు.

అయినా వ‌క్కంతాన్ని ఎవ‌రూ త‌క్కువ అంచ‌నా వేయ‌డం లేదు. అందుకే ఇప్పుడు యూత్ స్టార్ రూపంలో ఒక అద్భుత అవ‌కాశం అత‌డికి చిక్కింది. ఈసారి గ‌త లోటుపాట్ల నుంచి బ‌య‌ట‌ప‌డి ఇప్పుడు నితిన్ కోసం వ‌క్కంతం ఎలాంటి క‌థ‌ను రాసుకున్నారు? అన్న‌ది వేచి చూడాలి.
Tags:    

Similar News