ఈమద్య కాలంలో చిన్నా పెద్ద సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలంటూ ప్రచారం చేస్తున్నారు. పోయేదేముంది అంటూ హిందీలో కూడా ప్రతి ఒక్క సినిమాను డబ్బింగ్ చేసి వదిలే ప్రయత్నాలు చేస్తున్నారు. థియేటర్ రిలీజ్ అయ్యి సక్సెస్ కాకుంటే కనీసం శాటిలైట్ లో టెలలికాస్ట్ చేయడానికి అయినా డబ్బింగ్ వర్షన్ ఉపయోగపడుతుంది కదా అనేది కొందరి అభిప్రాయం. అందుకే చాలా సినిమాలను హిందీలో డబ్ చేస్తున్నారు.
బాహుబలి.. సాహో.. పుష్ప ఇలా మన తెలుగు సినిమాలు కొన్ని అక్కడ మంచి ఫలితాన్ని సాధించాయి. దాంతో వరుసగా హిందీ బాక్సాఫీస్ వద్ద దాడికి తెలుగు సినిమాలను రెడీ చేస్తున్నారు. ఒక మోస్తరుగా ఆడి వసూళ్లు దక్కించుకున్నా కూడా చాలా బెటర్ కదా అనే ఉద్దేశ్యంతో హిందీ ఫిల్మ్ మేకర్స్ మరియు బయ్యర్లు మన సినిమాలను కొనుగోలు చేసేందుకు చాలా ఆసక్తిని కనబర్చుతూ వస్తున్నారు.
ఇటీవలే విడుదలైన భీమ్లా నాయక్ సినిమాను కూడా హిందీలో విడుదల అవ్వబోతుంది. ఇటీవలే హిందీ ట్రైలర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. రీమేక్ సినిమా అయిన భీమ్లా నాయక్ ను హిందీలో విడుదల చేయబోతున్నప్పుడు మా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాను ఎందుకు హిందీలో విడుదల చేయరు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా హిందీ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
ఇప్పటికే తెలుగు తో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాను హిందీ లో కూడా డబ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే చర్చ మొదలు అయ్యింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ హిందీ డిస్ట్రీబ్యూటర్ ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేశారనే టాక్ వినిపిస్తుంది. సర్కారు వారి పాట కథ బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.
మహేష్ బాబు ఇప్పటి వరకు హిందీ డైరెక్ట్ రిలీజ్ చేయలేదు. థియేట్రికల్ మూవీస్ లేవు అయినా కూడా అక్కడ మహేష్ బాబుకు మంచి ఫాలోయింగ్ ఉంది అనడంలో సందేహం లేదు. టాలీవుడ్ స్టార్ గా ఆయన ఉత్తరాదిన కూడా పాపులర్ అయ్యాడు. అందుకే ఆయన నటించిన ఈ సినిమా తప్పకుండా అక్కడ హడావుడి చేస్తుందని... కమర్షియల్ గా మహేష్ బాబు కు మంచి సినిమా గా నిలుస్తుందనే టాక్ వచ్చింది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాను మే 12వ తారీకున సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల అయిన కళావతి పాట మంచి సక్సెస్ ను దక్కించుకుని సినిమాపై అంచనాలు పెంచేసింది.