మెగాస్టార్ చారిటీ వెబ్ సైట్ లాంచింగ్

Update: 2021-10-17 07:05 GMT
మెగాస్టార్ చిరంజీవి జీవితంపై పుస్త‌క ర‌చ‌యిత‌లు ప‌లు పుస్త‌కాల్ని రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆయ‌న సంపూర్ణ జీవితంలో తెలియ‌ని ఎన్నో విశేషాల్ని వెల్ల‌డించేందుకు ఆ పుస్త‌కాల్లో స్కోప్ చాలా త‌క్కువ. అలాగే చిరంజీవి చారిట‌బుల్ ట్రస్ట్ కార్య‌క‌లాపాల‌కు తెలుగు మీడియాలో స‌రైన ప్ర‌చారం ద‌క్క‌ని సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు వెబ్ సైట్ ద్వారా సాధ్య‌మైనంతగా చిరుకి సంబంధించిన విష‌యాల్నిఅప్ డేట్ చేయ‌నున్నారు.

`మిష్టర్ చిరంజీవి` పేరుతో వెబ్ సైట్ ను ప్రారంభించేందుకు మెగా కాంపౌండ్ సన్నాహకాల్లో ఉంద‌ని తెలిసింది. ఇప్ప‌టికే ఈ వెబ్ సైట్ డ‌మ్మీ వెర్ష‌న్ రెడీ అయ్యింది. త్వ‌ర‌లో సైట్ ని లాంచ్ చేసి నిరంత‌ర అప్ డేట్స్ ని అందించ‌నున్నారు. ఈ వెబ్ సైట్ ను ఉదయం 9 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వద్ద మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అతిథిగా లాంచ్ చేయ‌నున్నారు.

ఇటీవ‌ల చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ త‌ర‌పున క‌రోనా రోగుల‌కు ఆక్సిజ‌న్ సేవ‌ల్ని అందించిన సంగ‌తి తెలిసిందే. దీనికోసం చిరు-చ‌ర‌ణ్ బృందం కోట్లాది రూపాయ‌ల్ని ఖ‌ర్చు చేసింది. కానీ తాము ఇంత చేసినా కానీ తెలుగు మీడియా దానికి స‌రైన ప్రాచుర్యం క‌ల్పించ‌ని సంగ‌తి తెలిసిందే. కరోనా క‌ష్ట కాలంలో మెగాస్టార్ చిరంజీవి క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ని ప్రారంభించి కార్మికుల‌ను ఆదుకున్నారు. దానికి కూడా ప్ర‌చారం ద‌క్క‌క‌పోగా విమ‌ర్శించిన నోళ్లే ఎక్కువ‌. అందుకే ఇప్పుడు ప్ర‌తిదీ పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు ఈ వెబ్ సైట్ స‌హ‌క‌రించ‌నుంది. ఈ వెబ్ సైట్ లో మెగా కాంపౌండ్ సినిమాల‌కు ప్ర‌మోష‌న్ చేస్తారా లేదా? అన్న‌ది చూడాలి.


Tags:    

Similar News