అందాల రాక్షసి అలా చేసిందా..

Update: 2018-01-30 23:30 GMT
హీరోయిన్స్ టాలెంట్ ఏ రేంఙ్ లో ఉంది అనే విషయం తెలుసుకోవాలంటే ఎక్కువగా పాటల్లోనే అర్ధమవుతుంది అనేది చిత్ర దర్శకుల నమ్మకం. పాట రాగాన్ని బట్టి హావభావాలను కరెక్ట్ గా చూపిస్తేనే అసలు మజా ఉంటుంది. అలాగే స్టెప్పులు కూడా చాలా ముఖ్యమే. పాట మెలోడీ అయినా ఫాస్ట్ బీట్ అయినా సోయగాలను తెరపై అందంగాచూపిస్తేనే ఆడియెన్ కి కనెక్ట్ అవుతుంది అంటుంటారు. దీంతో ముద్దుగుమ్మలు ఎక్కువగా డ్యాన్సులకోసం ఎక్కువగా కష్టపడతారు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. లావణ్య త్రిపాఠీ ఇప్పుడు అలా చేస్తుందా లేదా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అమ్మడికి గ్లామర్ గా కనిపించడానికి చాలా ఇష్టపడుతుంది. చాలా సార్లు నన్ను ఆ విధంగా చూపిస్తే చాలా ఇష్టమని కూడా చెప్పింది. అయితే ప్రస్తుతం ఈ రాక్షసి ఇంటిలిజెంట్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో కలిసి పోటా పోటీగా స్టెప్పులు వేసిందట. మెగాస్టార్ ఎవర్ గ్రీన్ చమకు చమకు చాం పాటను ఇందులో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

కొండవీటి దొంగ లోని ఆ పాటలో విజయశాంతి - చిరుతో కరెక్ట్ గా స్టెప్పులు వేసి అందరి మనసును దోచేసుకుంది. అయితే రాములమ్మ తరహాలోనే అందాల రాక్షసి కూడా కుమ్మేసిందని తెలుస్తోంది. పాటకు సంబందించిన కొన్ని స్టిల్స్ ని చూస్తుంటే  తన సెక్సీ అందాలను అందులో చాలానే ప్రయోగించిందట. ఇప్పటివరకు లావణ్య డ్యాన్స్ లలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ ఇంటిలిజెంట్ లో మాత్రం స్టెప్పుల్లో రొమాన్స్ ని గట్టిగానే చూపించిందని టాక్. మరి ప్రేక్షకుల ఊహలకు తగ్గట్టు లావణ్య చేసిందో లేదో తెలియాలంటే ఫిబ్రవరి 9వరకు ఆగాల్సిందే.     
Tags:    

Similar News