అందాల రాక్షసి సినిమాలో నటించినప్పుడు ఊహించి ఉండదు. తనకి ఇంత సుదీర్ఘ కెరీర్ ఉంటుందని. నాగార్జున అంతటి పెద్ద స్టార్ సరసన అవకాశం వస్తుందని, విష్ణు, నాని లాంటి హీరోలకు పెయిర్ గా నటిస్తానని అనుకుని ఉండదు. కానీ అనుకోనివన్నీ జీవితంలో జరుగుతున్నాయ్. ఆ లక్కీ గాళ్ ఎవరో ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును లావణ్య త్రిపాఠి. ఈ భామ నటించిన భలే భలే మగాడివోయ్ ఈ సెప్టెంబర్ 4న రిలీజవుతోంది. ఈ సందర్భంగా లావణ్య ఏం చెప్పిందంటే..?
= భలే భలే మగాడివోయ్.. పూర్తి వినోదాత్మక చిత్రం. ఇందులో ఓ అమాయకమైన అమ్మాయిగా, కూచిపుడి డ్యాన్సర్ గా నటిస్తున్నా. స్వతహా కథక్ తెలుసు కాబట్టి... కూచిపూడి కోసం నిత్యం సెట్స్ లో అరగంట సేపు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసేదాన్ని.
=దూసుకెళ్తా తర్వాత వరుసగా అవకాశాలొచ్చినా ఏది పడితే అది ఒప్పేసుకోలేదు. ఆచితూచి ఎంపికలు ఉంటాయి. ఇప్పటికైతే నాలుగు సినిమాలతో బిజీ. కాస్త తీరిక సమయం చిక్కితే వారంపాటు సెలవు తీసుకోవాలనుంది.
=నచ్చితే ఏదైనా చేస్తా. మనంలో అతిధి పాత్ర, అప్పట్లో ఓ లఘుచిత్రం అలా చేసినవే. నేను ఛాన్సుల్లేవని బాధపడే టైపు కాదు. కథేంటి? పాత్ర ఏంటి? సీన్ ఏంటి అన్నది బాగా తెలుసుకునే సెట్ లో మూవ్ అవుతా.
= నాగార్జున డౌన్ టు ఎర్త్. కూల్, సపోర్టివ్. సోగ్గాడే షూటింగులో బోలెడంత సాయం చేశారు. నేను రమ్యకృష్ణ గారికి పెద్ద అభిమానిని. తనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అలాగే నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా, లచ్చిందేవికి లక్కుంది సినిమాల్లో నటిస్తున్నా. అల్లు శిరీష్ సరసన గీతాఆర్ట్స్ సినిమాలో చేస్తున్నా.
=నాని అమేజింగ్ యాక్టర్. స్పాంటేనియస్. ఓ కొత్త హీరోలా తాను ఎలా చేశానో ప్రతి సీనూ మానిటర్ లో చూసుకుంటాడు. ఈగ చూసి పడిపోయా. చిన్న పాత్రలో పెద్ద ఇంపాక్ట్ చూపించాడు. తర్వాత నాని చేసిన అన్ని సినిమాలు చూశాను.
=అందాల రాక్షసి ఓ రకంగా ప్లస్, మరో రకంగా మైనస్. అందులో మిధునగా పద్ధతిగా కనిపించా. తెలుగు ప్రేక్షకులు నన్ను అలానే చూడాలనుకుంటున్నారు. గ్లామర్ పాత్రలు చేస్తే జీర్ణించుకోలేరు. టైమ్ పడుతుందనుకుంటున్నా.
=పొరుగు భాషల్లో అవకాశాలొచ్చినా తెలుగు నా తొలి ప్రాధాన్యత. తమిళ్, కన్నడ, హిందీలో ఛాన్సులొచ్చినా ఆలోచించి అంగీకరిస్తానంతే.
=మారుతి చాలా యాక్టివ్. సెట్‌లో సందడిగా ఉంటుంది. నన్ను ఆయన తమ్ముడు అని పిలిచేవారు. మెమరబుల్ ఎక్స్‌పీరియెన్స్.