అసలే కుర్ర హీరోయిన్ల తాకిడి ఎక్కువగా ఉంది. దానికి తోడు గత ఏడాది చేసిన సినిమాలు యుద్ధం శరణం-ఉన్నది ఒకటే జిందగి చేదు ఫలితాన్ని ఇవ్వగా ఫిబ్రవరిలో వచ్చిన ఇంటెలిజెంట్ డిజాస్టర్ పీడకలగా మారింది. మొన్నటి దాకా వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న లావణ్య త్రిపాఠి ప్రస్తుత పరిస్థితి ఇది. అయినా కూడా తగ్గకుండా బౌన్స్ బ్యాక్ అయ్యేలా క్రేజీ ఆఫర్లు బాగానే కొట్టేస్తోంది. నిఖిల్ హీరోగా థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ముద్రలో లావణ్యనే కథానాయిక. తొలుత ఒరిజినల్ వెర్షన్ హీరోయిన్ క్యాథరిన్ త్రెస్సాను అనుకున్నప్పటికి ఏవో కారణాల వల్ల ఆఫర్ కాస్తా లావణ్య ఒళ్ళో వచ్చి పడింది. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఇది గన్ షాట్ హిట్ అనే ధీమాలో ఉంది లావణ్య. ప్రస్తుతం ముద్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ముద్రతో పాటు వరుణ్ తేజ్ తో హీరోగా ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న వ్యోమగామి(వర్కింగ్ టైటిల్)లో ఛాన్స్ కొట్టేయటం చిన్న విషయం కాదు. పైగా తన లాగే కెరీర్ గ్రాఫ్ కాస్త డాల్ గా ఉన్న రాశి ఖన్నా వరుణ్ తో చేసిన తొలిప్రేమ వల్లే మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది. ఈ రకంగా తనకు కూడా మెగా హీరో సెంటిమెంట్ కలిసి వస్తుందని నమ్మకంగా ఉంది లావణ్య. కాకపోతే ఇందులో తను సోలో హీరోయిన్ కాదు. అదితి రావు హైదరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి. ఘాజీతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన సంకల్ప్ రెడ్డి దీన్ని అంతరిక్షం నేపథ్యంలో రూపొందిస్తున్నాడు. వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్ల పాత్రలను చాలా వినూత్నంగా డిజైన్ చేసినట్టు తెలిసింది. ముద్ర క్రైమ్ థ్రిల్లర్ కాగా వరుణ్ మూవీ స్పేస్ థ్రిల్లర్. ఈ రెండు కనక హిట్ అయితే లావణ్య మళ్ళీ రేస్ లో ముందుకు వచ్చినట్టే.