రకుల్ లెగ్ తీసి ఈమెకు పెట్టేశారు

Update: 2016-08-18 11:30 GMT
ఒకప్పుడు తెలుగు ఇండస్ర్టీలో రకుల్ ప్రీత్ సింగ్ ను గోల్డెన్ లెగ్ అన్నారు. సడన్ గా ఆమె సందీప్ కిషన్ కు హిట్టివ్వడంతో గోల్డెన్ అన్నారు. కాని కిక్ 2 - బ్రూస్ లీ వంటి ఫ్లాపులు రావడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. అప్పట్లో ఈ విషయంపై అమ్మడు స్పందిస్తూ.. 'నా లెగ్ ఎప్పుడూ ఒక్కటేనండి. అందులో గోల్డు సిల్వర్ ఐరన్ ఏమీ లేదు. హిట్ నా చేతిలో ఉంటుందా?' అని ప్రశ్నించింది. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా అలాగే చెబుతోందట.

భలే భలే మగాడివోయ్ హిట్టయ్యింది. తరువాతే వెంటనే సోగ్గాడే చిన్ని నాయనా సినిమా కూడా బాగా ఆడేసింది. ఇప్పుడు శ్రీరస్తు శుభమస్తు కూడా ఆడుతోంది. అందుకే అందరూ కూడా అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిది గోల్డెన్ లెగ్ అంటూ పొగిడేస్తున్నారు. ఆ లెక్కన అమ్మడు కాలు పెడితే హిట్టే అని ఫీలై చాలామంది నిర్మాతలు అడ్వాన్సులు కూడా ఇచ్చేస్తున్నారట. కాకపోతే మధ్యలో అమ్మడు లచ్చిందేవికి ఓ లెక్కుంది అనే సినిమాను కూడా చేసింది. గోల్డెన్ లెగ్ అయితే ఆ సినిమా కూడా హిట్టవ్వాలిగా? సరిగ్గా ఇదే ప్రశ్నలు అడుగుతోంది లావణ్య.

సినిమా అనేది కంటెంట్ ను బట్టే ఆడుతోంది కాని.. హీరోయిన్ లెగ్ వలన మాత్రం ఆడదని అమ్మడు తన దగ్గరకు వచ్చిన నిర్మాతలకు క్లాసులు పీకడం విశేషం. ప్రస్తుతం అమ్మడు శర్వానంద్ సరసన ఒక సినిమా - అలాగే సందీప్ కిష్‌న్ తో బైలింగువల్ - ఇంకా మరో రెండు కొత్త సినిమాలు చేస్తోంది.
Tags:    

Similar News