శుక్రవారం వచ్చేసరికి వెండితెర వెలిగేలా.. కొత్త కాంతులు విరజిమ్మేలా కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. అయితే.. ఇదంతా కరోనాకు ముందు. కరోనా వేళ.. వచ్చిన చాలా కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. వినోద రంగానికి ఇది మినహాయింపు కాదు. శుక్రవారం వచ్చేసరికి థియేటర్లలో కొత్త సినిమాలు ఎలా సందడి చేస్తున్నాయో.. ఓటీటీ ప్లాట్ ఫాం మీదా సినిమాలు విడుదల అవుతూ.. ప్రేక్షకులకు కొత్త సినిమా విందును అందిస్తున్నాయి.
అంత కంతకూ విస్తరిస్తున్న ఓటీటీ ఫ్లాట్ ఫాంలు.. కొన్ని పెద్ద సినిమాల్ని ఫ్యాన్సీ ధర ఇచ్చేసి తమ సొంతం చేసుకుంటున్నాయి. ఆ కోవలోకే వస్తుంది సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం. వెండితెర మీద వెలగాల్సిన ఈ మూవీ ఓటీటీ లో విడుదలైనప్పటికీ.. మంచి టాక్ రావటమే కాదు.. ఈ సినిమాను చూడాలన్న రికమండేషన్లు వాట్సాప్ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియాలో ఎవరికి వారుగా చేస్తున్న పరిస్థితి. ఈ సినిమాను చూసినోళ్లంతా అమ్ము తల్లి పాత్రకు విపరీతంగా కనెక్టు కావటమే కాదు.. ఆమెకు ఎంత కష్టం వచ్చిందన్న వేదనకు గురవుతున్నారు. రియల్ గా జరిగిన ఈ ఉదంతాన్ని రీల్ గా మార్చిన వేళ.. అమ్ముతల్లి పాత్రకు ఒరిజినల్ ఎవరు? ఆమె ఎక్కడున్నారు? ఇప్పుడామె పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్నలుగా మారాయి.
ఈ సినిమా చూసిన పలువురు స్పందించినట్లే.. నటుడు.. దర్శకుడైన లారెన్స్ స్పందించారు. రీల్ అమ్ముతల్లి.. రియల్ లైఫ్ లో పార్వతమ్మ గురించిన ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. బాధితురాలు పార్వతమ్మ పోరాటాన్ని చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు చెప్పారు. 28 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు అందరిని ఆలోచించేలా చేయటమే కాదు.. పోలీసుల దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్న పరిస్థితి. ఒక రియల్ స్టోరీని మనసుల్ని హత్తుకునేలా చేసిన దర్శకుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక.. పార్వతమ్మకు ఇప్పటికి కొత్త ఇల్లు కల తీరలేదని చెబుతున్నారు. పార్వతమ్మకు కొత్త ఇంటిని తాను కట్టిస్తానని ప్రకటించారు లారెస్స్. పార్వతమ్మ పోరాటం తనను ప్రభావితం చేసిందన్న లారెన్స్.. మిగిలిన వారి కంటే భిన్నంగా ఆమె బాగోగుల మీద మాట్లాడటం.. ఆమెకు సాయం చేసేందుకు సిద్ధం కావటాన్ని అభినందిస్తున్నారు.