కష్టంలో ఉన్న వారి గురించి తెలిసినంతనే తమకు చేతనైనంత సాయం చేసే సినీ ప్రముఖులు కొందరే ఉన్నారని చెప్పాలి. పేరుకు ముందు చాలా రకాల స్టార్లు పెట్టుకున్న వారితో పోలిస్తే.. ఎలాంటి స్టార్ పేరు లేని కొందరు అపన్నులకు సాయం అందిస్తూ.. వారిని ఆదుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో కొరియోగ్రాఫర్ కమ్ దర్శకుడు కమ్ నటుడు లారెన్స్ ఒకరు.
కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు.. వారిని ఆదుకునేందుకు.. సాయం అందించేందుకు వెనుకాడకుండా డబ్బులు ఖర్చు పెట్టేయటం తెలిసిందే. ఇలాంటి ఇమేజ్ ఉన్నోళ్లు టాలీవుడ్.. కోలీవుడ్ లలో కొందరి పేర్లు తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా లారెన్స్ సాయం కోరి చెన్నై వచ్చిన ఒక పేద కుటుంబం ఆయన్ను కలవలేక.. భిక్షాటన చేస్తున్న వైనం తాజాగా బయటకు వచ్చింది.
తమిళనాడుకు చెందిన రాజపాళ్తైయంకు చెందిన గృహలక్ష్మీకి పెళ్లి జరిగింది. ఆమెకో కొడుకు పుట్టాడు. ఆ ఆనందం ఎంతో కాలం నిలవకుండా ఆ పిల్లాడికి అనారోగ్యం బారిన పడ్డాడు. రెండేళ్ల వయసులో ఉన్న ఆ పిల్లాడి పేరు గురుసూర్య. సరిగా నడవలేని ఆ కుర్రాడికి.. తాజాగా గుండెజబ్బు వచ్చింది. దీంతో.. బాధ్యతను స్వీకరించని ఆమె భర్త చెప్పకుండా ఆమెను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. గృహలక్ష్మి ఒక సోదరుడు ఉన్నాడు. ఆమె బాధ్యతను అతను తీసుకొని.. సోదరికి..మేనల్లుడి సంరక్షణ బాధ్యతల్ని తీసుకున్నాడు.
అయితే.. తాజాగా మేనల్లుడి అనారోగ్యం నుంచి బయటపడేసేందుకు అవసరమైన డబ్బులు లేకపోవటం.. ఎలాగైనా అతడ్ని దక్కించుకోవటానికి ఆ మేనమామ పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. తెలిసిన వారిని.. బంధువుల్ని సాయం అడిగినా చేసింది లేదు. దీంతో కొందరు ఇచ్చిన సలహాతో గృహలక్ష్మీ.. ఆమె సోదరుడు కలిసి చెన్నై మహానగరానికి వచ్చారు. నటుడు లారెన్స్ ను కలిస్తే.. తప్పకుండా సాయం చేస్తారన్న మాటతో పుట్టెడు ఆశతో చెన్నైకి వచ్చారు.
రావటమైతే వచ్చారుకానీ వారికి ఎవరూ లారెన్స్ ఇంటి అడ్రస్ చెప్పలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని వారు.. ఎగ్మూరో రైల్వేస్టేషన్ బయట భిక్షాటన చేస్తున్నారు. ఏదోలా లారెన్స్ అడ్రస్ దొరుకుతుందని.. పిల్లాడికి మంచి వైద్యం లభిస్తుందన్న ఆశతో వారున్నారు. విన్నంతనే కళ్లు చెమ్మగిల్లేలా ఉన్న వీరి ఉదంతం లారెన్స్ కు తెలిస్తే బాగుండు. ఆయనకు సన్నిహితులకు తెలిసినా.. ఈ సమాచారాన్ని చేరవేస్తే సాయం అందుతుంది. మనసున్నమారాజులు ఎవరైనా దయతలిస్తే.. లారెన్స్ స్పందించే లోపే ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. వారి కష్టం తీరాలని మనసారా కోరుకుందాం.