రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన `రంగస్థలం` సంచలనాల గురించి తెలిసిందే. గోదారి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా హిస్టరీలో క్లాసిక్ హిట్ గా నిలిచింది. నాన్ బాహుబలి రికార్డులు తిరగరాస్తూ నంబర్-1గా నిలిచింది. జాతీయ అవార్డుని సైతం దక్కించుకుంది. అందుకే ఈ సినిమా ఇరుగు పొరుగు భాషల్లో రీమేక్ అవుతోంది అంటే అందరిలో ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.1.5 కోట్లకు మైత్రి సంస్థ నుంచి లారెన్స్ మాస్టార్ రైట్స్ ని చేజిక్కించుకున్నాడు. తాను నిర్మించే ఈ చిత్రానికి ప్రస్తుతం దర్శకుల పేర్లను పరిశీలిస్తున్నాడట. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. లారెన్స్ - లింగుస్వామి కాంబినేషన్ అంటేనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాస్ మాస్ కలిస్తే ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే తెలుగు నాట అంత క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని చెడగొట్టరు కదా? అంటూ చరణ్ అభిమానుల్లో సందేహం వ్యక్తమైంది.
తెలుగులో గోదారి నేటివిటీ .. స్థానిక భాస యాస ఎంతో మ్యాజిక్ చేశాయి. చరణ్ -సమంతల నటనతో పాటు అనసూయ రంగమ్మత్త పాత్ర ఎంతో పెద్ద మ్యాజిక్ చేసింది. దేవీశ్రీ మ్యూజిక్ మాయాజాలం తక్కువేమీ కాదు. ఇప్పుడు తమిళ నేటివిటీ అంటే ఏ నేపథ్యానికి కథను షిఫ్ట్ చేస్తారు? అన్నది చూడాలి. ఇక ఇందులో క్యాస్టింగ్ ఎవరిని ఎంచుకుంటారు? అన్నది ఆసక్తికరమే. లారెన్స్ మాస్టార్ అన్నిటికీ క్లారిటీనిస్తారేమో చూడాలి.