ప్రతియేటా టాలీవుడ్ నుంచి కనీసంగా 100 పైగా సినిమాలు రిలీజవ్వడం చూస్తున్నదే. ఓవరాల్ గా సౌత్ నుంచి 500 పైగా సినిమాలు రిలీజవుతుంటాయి. కానీ ఈసారి సన్నివేశమే వేరుగా ఉంది. 2020లో విడుదలైన సినిమాల సంఖ్య షాక్ కి గురి చేస్తోంది.
గడచిన పదేళ్లలో తక్కువ సినిమాలు రిలీజైన ఏడాది ఇదే. 2020 లో విడుదలైన సినిమాలు మొత్తం 65. వాటిలో 50 నేరుగా తెలుగులో తెరకెక్కినవి కాగా.. 15 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. స్ట్రెయిట్ సహా అనువాదాలు కలుపుకుని 2011లో 243- 2012లో 224 - 2013లో 270 - 2014లో 276 - 2015లో 245- 2016లో 266- 2017లో 245 - 2018లో 228- 2019లో 269 చిత్రాలు విడుదలవ్వగా.. 2020లో 65 చిత్రాలు మాత్రమే రిలీజయ్యాయి.
ఈ దశాబ్ధంలోనే లీస్ట్ ఈ సంవత్సరమే. కరోనా మహమ్మారీ ప్రభావం టాలీవుడ్ ని ఒక రేంజులోనే తాకింది. షూటింగుల్లేవ్.. రిలీజుల్లేవ్.. కనీసం 2021లో అయినా పరిస్థితి మెరుగుపడుతుందనేదే హోప్.