థియేటర్లను మూయించిన లక్ష్మీస్ ఎన్టీఆర్

Update: 2019-05-04 10:46 GMT
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణతో సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం ఫైనల్ రన్ పూర్తి చేసుకుని దర్శకుడి గత కళాఖండాలతో పోలిస్తే బెటర్ అనే రిమార్క్ తెచ్చుకోవడం తప్ప మరీ అద్భుతాలు చేయలేకపోయింది అయినా ఇది ఇంకా వార్తల్లో నిలవడం వర్మకు మాత్రమే సాధ్యమేమో.

ఆంధ్రప్రదేశ్ లో విడుదల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న టీం మొన్న మే 1 డేట్ ప్రకటించి ధియేటర్లను కూడా కేటాయించి హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమీషన్ స్పష్టంగా నిబంధనలు చెప్పినప్పటికీ కడప జిల్లాలో కొన్ని స్క్రీన్లలో ఇది ప్రదర్శించడం ఇప్పుడు ఏకంగా వాటి మూతవేతకు దారి తీసింది.

మే 1న మొత్తం మూడు ధియేటర్లు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ప్రదర్శించాయి. రైల్వే కోడూరులోని ఏఎస్ఆర్ పిక్చర్ ప్యాలెస్ ని ఈ కారణంగా సీజ్ చేస్తూ తహసిల్దార్ చర్యలు తీసుకోవడం అక్కడ సంచలనంగా మారింది. డిస్ట్రిబ్యూటర్ క్లియరెన్స్ ఇచ్చి శాటిలైట్ ద్వారా కేడిఎం డౌన్ లోడ్ చేసాక రూల్స్ ప్రకారమే ప్రదర్శించామని దానికి మా ధియేటర్ ను సీజ్ చేయడం ఏమిటని సదరు యాజమాన్యం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ చర్య కాబట్టి దీనికి ఇప్పటికిప్పుడు పరిష్కారం దొరకదు కాబట్టి వర్మ పుణ్యమా అని ఏకంగా కొన్ని రోజుల పాటు సినిమా హాల్ మూసివేతకు గురయ్యింది.
    

Tags:    

Similar News