డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ చిత్రం 'లైగర్'. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఛార్మి-కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
'సాలా క్రాస్ బ్రీడ్' అంటూ వచ్చిన పోస్టర్ ఆడియన్స్ ను తెగ అట్రాక్ట్ చేసింది. దీంతో.. అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. కాగా.. 120 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ.. ముంబైలో మళ్లీ మొదలుపెట్టాలని ఇటీవల అనుకున్నారు. కానీ.. ముంబైలో కరోనా తీవ్రత ఎక్కువగానే ఉండటంతో ఆగిపోయారు.
హైదరాబాద్లోనే ముంబై సెట్ వేసి షూటింగ్ చేయాలని కూడా భావించారు. కానీ.. పూరి మనసు ముంబై వైపే లాగిందట. దీంతో.. మరోసారి నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా మేజర్ గా ముంబై బ్యాక్ డ్రాప్ తో సాగనుంది. దీనివల్ల అక్కడి లొకేషనల్లోనే షూట్ చేయాల్సి ఉంది. అందువల్ల.. కాస్త లేటైనా ముంబైలోనే షూట్ కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడట. దీని ప్రకారం.. ఫిబ్రవరిలో షూట్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది.