'లైగర్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: ఆల్ టైమ్ డిజాస్టర్స్ లిస్టులోకి VD సినిమా..?

Update: 2022-08-29 10:30 GMT
భారీ అంచనాల నడుమ విడుదలైన ''లైగర్'' సినిమా ఆడియన్స్ ను తీవ్ర నిరాశ పరిచింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా కేవలం రూ. 25 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.

'లైగర్' సినిమా టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ డే వసూళ్లలో పర్వాలేదనిపించింది. అయితే మౌత్ టాక్ నెగెటివ్ గా రావడం.. రివ్యూలు ఆశాజనకంగా లేకపోవడంతో రెండో నుంచే భారీ డ్రాప్స్ కనిపించాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఏ దశలోనూ పుంజుకునేలా కనిపించలేదు. దీంతో భారీ నష్టాలను చవిచూసే పరిస్థితి వచ్చింది.

ధర్మ ప్రొడక్షన్స్ & పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన 'లైగర్' సినిమా థియేట్రికల్ రైట్స్ ను దాదాపు 90 కోట్ల వరకూ విక్రయించారని సమాచారం. ఇప్పుడు ఈ చిత్రం మొదటి వారాంతంలో 25 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేయడానికి ఇంకా చాలా కలెక్ట్ చేయాల్సి ఉంది.

ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే 'లైగర్' సినిమా 60 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే టాలీవుడ్ లో ఆల్-టైమ్ డిజాస్టర్ లిస్టులో విజయ్ దేవరకొండ సినిమా కూడా చేరుతుందనడంలో సందేహం లేదు.

టాలీవుడ్ లో రాధేశ్యామ్ - ఆచార్య - అజ్ఞాతవాసి - స్పైడర్ - సాహో - ఎన్టీఆర్ కథానాయకుడు - ఎన్టీఆర్ మహానాయకుడు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ జాబితాలో ఉన్నాయి. డీసెంట్ ఓపెనింగ్ తర్వాత రెండో రోజు నుంచి ఏ దశలోనూ కోలుకోలేకపోయిన 'లైగర్' మూవీ కూడా వీటి సరసన చేరే అవకాశం ఉంది.

నిజానికి 'లైగర్' సినిమాపై విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాథ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇండియా షేక్ అవుతుందని.. థియేటర్లలో రీసౌండ్ వస్తదని.. హావోక్ అని.. ఎటాక్ అని.. ఇలా రకరకాల స్టేటమెంట్స్ ఇచ్చాడు వీడీ. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం రెండో రోజు నుండి బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిగా క్రాష్ అయ్యింది.

లైగర్ సినిమాతో ప్రమేయం ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్లందరూ నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని ట్రై చేస్తున్న విజయ్ కు.. ఇదొక అవాంఛనీయ డిజాస్టర్ అనే చెప్పాలి. మరి రాబోయే 'ఖుషి' & 'JGM' చిత్రాలతో మళ్లీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

* వరల్డ్ వైడ్ గా 'లైగర్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వివరాలు పరిశీలిస్తే..

నైజాం - 5.70 కోట్లు

సీడెడ్ - 1.80 కోట్లు

UA - 1.65 కోట్లు

గుంటూరు - 0.93 కోట్లు

ఈస్ట్ - 0.77 కోట్లు

వెస్ట్ - 0.58 కోట్లు

కృష్ణ - 0.69 కోట్లు

నెల్లూరు - 0.53 కోట్లు

AP/TS మొత్తం - 12.65 కోట్లు

KA+TN+KL - 2 కోట్లు

నార్త్  - 7 కోట్లు

OS - 3.5 కోట్లు

వరల్డ్ వైడ్ మొత్తం - 25.15 కోట్లు (షేర్)



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News