కొహ్లీలాగే బాలీవుడ్ కూడా ఫామ్ ని కోల్పోయింది! స‌ల్మాన్ ఖాన్

Update: 2022-07-26 15:30 GMT
స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కొహ్లీ ఫామ్ ని కోల్పోయి ఎంత‌గా ఇబ్బంది ప‌డుతున్నాడో..అత‌ని ఆట తీరు చూస్తేనే అర్ధ‌మ‌వుతోంది. బంతి మీద‌కు దూసుకుపోయే కొహ్లీ ఇప్పుడు అదే బంతిని చూసి భ‌య‌ప‌డుతున్నాడా? అన్న సందేహం రాక‌మాన‌దు. అంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌  కొహ్లీ  గేమ్ లో క‌నిపిస్తుంది. సిక్స‌ర్లు..బౌండ‌రీలు బాదేసే కొహ్లీ ఇప్పుడు పూర్తిగా ఫామ్ కోల్పోయాడు.

ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా స‌హా అభిమానుల నుంచి  తీవ్ర‌మైన ఒత్తిడిని ఎదుర్కుంటున్నాడు. స‌రిగ్గా బాలీవుడ్ సినిమా ఇండ‌స్ర్టీ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంద‌న్నాడు స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్. హిందీ ప‌రిశ్ర‌మ‌ని..భాయ్ కొహ్లీ ఫామ్ తో పొలిక చేసాడు. ప్ర‌స్తుతం హిందీ సినిమా విజ‌యాలు లేక ఇబ్బంది ప‌డుతుంది. ఫామ్ లేమితో విమ‌ర్శ‌లు ఎదుర్కోంటున్న విరాట్ కొహ్లీ ప‌రిస్థితి మాది ఒక‌టే.

ఏ సినిమా హిట్ అవ్వ‌డానికైనా స‌క్సెస్  ఫార్ములా అంటూ ఏదీ ఉండ‌దు. ఒక‌వేళ ఉంటే అన్ని విజ‌యాలే వ‌స్తాయి క‌దా.   సినిమా స‌క్సెస్ లు  వాటిక‌వి అలా వ‌స్తుంటాయి` అని  భాయ్ సుదీప్  హీరోగా న‌టించిన `విక్రాంత్ రోణా` ప్ర‌చార కార్య‌క్ర‌మంలో  నిరుత్సాహ‌న్ని వ్య‌క్త ప‌రిచారు. భాయ్ మాట‌లు వాస్త‌వ‌మే. రెండేళ్ల‌గా బాలీవుడ్ కి చెప్పుకోద‌గ్గ భారీ స‌క్సెస్ ఒక్క‌టీ లేదు.

భారీ బ‌డ్జెట్ తో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమాల‌న్నీ ప‌రాజ‌యాలే. అస‌లే కోవిడ్ తో ఇండ‌స్ర్టీ సంక్షోభంలో ప‌డింది. మ‌ళ్లీ గాడిలో ప‌డాలంటే సినిమాలు విజ‌యాలు సాధించి లాభాలు బాట ప‌డితే త‌ప్ప సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డే ప‌రిస్థితి లేదు. మ‌రోవైపు కేంద్ర ప‌నితీరుతోనూ సినీ ప‌రిశ్ర‌మ‌లు ఇబ్బంది ప‌డుతున్నాయి. ఆర్ధిక వెసులుబాటు క‌ల్పించాల్సిన ప్ర‌భుత్వం న‌డ్డి విరిచే చ‌ర్య‌ల‌తో ముందుకెళ్తుంది.

వీట‌న్నింటి అధిగ‌మించాలంటే ఇండ‌స్ర్టీ లాభాల బాట ప‌ట్టాలి. అప్పుడే మ‌ళ్లీ బాలీవుడ్ ఫామ్ లోకి వ‌చ్చేది. అయితే  ప‌రిమిత బ‌డ్జెట్ లో తెర‌కెక్కిన కొన్ని సినిమాలు మాత్రం బాలీవుడ్  ప్ర‌తిష్ట‌ను కాస్తాకూస్తో నిల‌బెట్టాయి. `గంగూబాయి క‌తియావాడి`.. `ది క‌శ్మీర్ ఫైల్స్`.. `భూల్ బుల‌య్యా-2`.. `సూర్య‌వంశీ` సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. అవ‌న్నీ కేవ‌లం హిందీ ప‌రిశ్ర‌మ‌కే ప‌రిమిత‌మైనా స్థానిక మార్కెట్ లో మంచి వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రాలుగా చెప్పాల్సి ఉంటుంది.
Tags:    

Similar News