'లయన్‌' రిలీజ్‌ డేట్‌ కన్ఫమ్‌

Update: 2015-03-18 07:30 GMT
ఇక ఊహాగానాలకు తెరదించేయొచ్చు. బాలకృష్ణ కొత్త సినిమా 'లయన్‌' రిలీజ్‌ డేట్‌ కన్ఫమ్‌ అయింది. మే 1న కార్మిక దినోత్సవం నాడు 'లయన్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్‌ చివరి వారంలో సినిమా విడుదల కావచ్చని అనుకున్నారు కానీ.. అప్పటికి కొంచెం హడావుడి అవుతుందని భావించి.. మే 1కి వాయిదా వేశారు. ఆ రోజు శుక్రవారం, పైగా సెలవు. వీకెండ్‌ కూడా కలిసొస్తుండటంతో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసేశారు. ఏప్రిల్‌ 9న ఆడియో విడుదలకు ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా రానున్నారు.

'లెజెండ్‌' లాంటి లెజెండరీ హిట్టు తర్వాత బాలయ్య కోసం చాలామంది లైన్లో ఉన్నప్పటికీ ఓ కొత్త దర్శకుడు, చిన్న నిర్మాతకు ఛాన్స్‌ ఇచ్చాడు బాలయ్య. సత్యదేవాకు ఇదే తొలి సినిమా. నిర్మాత రుద్రపాటి రమణరావు.. ఒకట్రెండు చిన్న సినిమాలు నిర్మించాడు. సమకాలీన అంశాల నేపథ్యంలో ఈ కథ తీర్చిదిద్దడంతో బాలయ్యకు తెగ నచ్చేసిందట. ఇందులో ఆయన సీబీఐ అధికారిగా నటిస్తున్నారు. బాలయ్య సరసన తొలిసారిగా త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. 'లెజెండ్‌' భామ రాధికా ఆప్టే కూడా మరో కీలక పాత్ర పోషిస్తోంది. మణిశర్మ చాన్నాళ్ల తర్వాత బాలయ్య సినిమాకు సంగీతాన్నందిస్తున్నాడు.

Tags:    

Similar News