నేషనల్ అవార్డ్స్: 'మహర్షి' 'జెర్సీ' లకు అవార్డుల పంట..!

Update: 2021-03-22 12:54 GMT
భారతదేశంలోని అన్ని భాషల సినిమా పరిశ్రమలో గౌరవంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను నేడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా సందడి వాతావరణం కనిపిస్తుంది. తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీల్లో ఈ సందడి ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. తెలుగు సినిమాలకు ఈసారి అయిదు జాతీయ అవార్డులు దక్కడం విశేషం. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న ఈ జాతీయ అవార్డుల పూర్తి జాబితాను ఇక్కడ చూడవచ్చు.

67వ జాతీయ చలన చిత్ర అవార్డులుః
ఉత్తమ హిందీ సినిమాః చిచోరే
ఉత్తమ తెలుగు సినిమాః జెర్సీ
ఉత్తమ తమిళ సినిమాః అసురన్‌
ఉత్తమ మలయాళ సినిమాః కల్లా నోట్టం
ఉత్తమ సంగీతంః విశ్వాసం (తమిళం)
ఉత్తమ మేకప్ ఆర్టిస్టుః హెలెన్‌
ఉత్తమ యాక్షన్‌ః అవనే శ్రీమన్నారాయణ (కన్నడ)
ఉత్తమ దర్శకుడుః గౌతమ్‌ తిన్ననూరి(జెర్సీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ః రాజు సుందరం (మహర్షి)
ఉత్తమ ఎడిటర్‌ః నవీన్ నూలి(జెర్సీ)
ఉత్తమ వినోదాత్మక సినిమాః మహర్షి
Tags:    

Similar News