గత కొన్నేళ్లుగా తమిళ హీరోలు తెలుగు బాక్సాఫీస్ వద్ద పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. వీళ్లలో ధనుష్ రేసులో చాలా కాలంగా ఉన్నా ఇక్కడ ఎందుకనో ప్రతిసారీ తడబడుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడూ మెరిసినా దానిని పూర్తిగా నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లలేకపోతున్నాడు. వేళై ఇల్ల పట్టాధారి (రఘువరన్ బీటెక్) తర్వాత తెలుగులో అంత పెద్ద హిట్టు లేదు. ఇటీవలే తమిళంలో అసురన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమాతో ధనుష్ పేరు మార్మోగింది. ఇందులో తండ్రి కొడుకుగా డబుల్ రోల్స్ లో ధనుష్ మెప్పించాడు. ఇక ఇదే హుషారులో వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు.
మరోసారి అతడు తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా `పట్టాస్`. తెలుగులో లోకల్ బోయ్ పేరుతో అనువాదమై రిలీజవుతోంది. తాజాగా లోకల్ బోయ్ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ధనుష్ డబుల్ రోల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓవైపు ఫుల్ రొమాంటిక్ మోడ్ లో.. మరోవైపు యాక్షన్ మోడ్ లో ఒదిగిపోయి కనిపిస్తున్నాడు. ఓవైపు కుస్తీపట్లు మార్షల్ విద్యలు తెలిసిన తండ్రిగా.. మరోవైపు జులాయి టర్న్ డ్ బాక్సర్ గా ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తున్నాడు. తండ్రి పాత్ర స్నేహతో రొమాన్స్.. కొడుకు పాత్ర మెహ్రీన్ తో రొమాన్స్.. మధ్యలో ఫైటర్లుగా బిగ్ ఛాలెంజ్.. మొత్తం కథంతా ట్రైలర్ లోనే లీక్ చేసేశారు. ఇందులో అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర ఏజ్డ్ పర్సన్ గా విలన్ గా కనిపిస్తుండడం ఆసక్తికరం.
తండ్రి పేరు కలుపుకోవడం కాదు.. నిలబెట్టడం రా గొప్ప! అంటూ ధనుష్ చెబుతున్న డైలాగ్ ని బట్టి లోకల్ బోయ్ ఛాలెంజ్ ని అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ కాస్త లెంగ్తీగా ఉన్నా.. క్లారిటీగానే కనిపిస్తోంది. అయితే ప్రతి ఫ్రేమ్ ని విసిగించకుండా చూపించడంలో దర్శకుడు ఎంత సఫలమయ్యాడు? అన్నదానిని బట్టే విజయం దక్కుతుంది. తమిళ నేటివిటీ వాసనలు తెలుగు వారికి నచ్చితే ఫలితం మంచిగానే రావొచ్చు. సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాకి ఆర్.ఎస్.సెంథిల్ దురైకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
Full View