మొదటిసారిగా ప్రపంచమంతా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా కుదేలైపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాల తో ప్రేక్షకులను అలరిస్తూ ఎంటర్‌టైన్ చేసే హీరోలందరూ స్వీయ నిర్బంధనలోకి వెళ్లిపోయారు. సినిమా షూటింగులను ఆపేసుకొని, థియేటర్లు మల్టీప్లెక్సస్ క్లోజ్ చేసుకుని, రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల విడుదలను వాయిదా వేసుకొని సినీ ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. ఈ నష్టం ఇప్పటి వరకు కొన్ని వేల కోట్ల దాకా ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 14కి ముగియనుంది. ఒకవేళ ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేస్తే సినీ పరిశ్రమ వెంటనే పుంజుకుంటుందా అంటే చెప్పలేని పరిస్థితి.
ఒకప్పుడు సినిమాలంటే ఎగబడి మరీ చూసే జనం ఇప్పుడు థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తారా అన్న ఆలోచనలు కూడా చాలానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తేసినా కూడా సినీ ఇండస్ట్రీలో థియేటర్లకు, షూటింగులకు ఏప్రిల్ 14న పెర్మిషన్స్ వచ్చే పరిస్థితి కనబడటం లేదని, ఇంకా లేట్ అయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు భావిస్తున్నారు. ఒకవేళ అన్ని పరిస్థితులు చక్కబడినప్పటికీ తిరిగి మళ్ళీ పుంజుకోవడం అంటే కాస్త కష్టమనే చెప్పాలి. అంతా సర్దుకునే సరికి జూన్, జులై నెలల వరకు టైమ్ పడుతుందని సినీ వర్గాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీని బ్రతికించుకోడానికి ప్రభుత్వం ముందుకొచ్చి అన్ని విధాలా సహాయం చేయాలని ప్రముఖ నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలించి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తేస్తే చిత్ర పరిస్థితి ఏంటనేది చూడాలి.