లవ్ స్టోరీ సుడి తిరిగిపోయిందట.. రెండో వారంలోనూ హడావుడే
సెకండ్ వేవ్ కరోనా తర్వాత.. చాలా ఆలస్యంగా సినిమాలు థియేటర్లు తెరుచుకోవటం తెలిసిందే. అందుకు మొదటి కారణం ఏపీలో థియేటర్లు తెరుచుకోకుండా.. ఒక్క తెలంగాణలో తెరిస్తే ఏం ప్రయోజనం అన్నది ఒకటైతే.. థర్డ్ వేవ్ ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో మళ్లీ ఎప్పుడు లాక్ డౌన్ విధిస్తారో తెలీని అయోమయం. అన్నింటికి మించి సెకండ్ వేవ్ షాక్ తర్వాత.. ధైర్యం చేసి సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు వస్తారా? అన్నసందేహం కూడా సినిమాల్ని విడుదల చేసే సాహసం చేయలేదు దర్శక నిర్మాతలు.
మొత్తానికి పడి లేస్తూ.. చిన్న సినిమాలు తమ లక్ పరీక్షించుకునే దిశలో భాగంగా విడుదల కావటం.. కరోనా ముందు పరిస్థితితో పోలిస్తే.. అంత లేకున్నా.. మరీ దారుణమన్న పరిస్థితి కూడా లేకపోవటం.. థర్డ్ వేవ్ కనుచూపు మేర కనిపించకపోవటంతో సానుకూల వాతావరణం నెలకొంది. అంచనాలకు భిన్నంగా కాస్త ఆలస్యంగా విడుదలకు వచ్చిన 'లవ్ స్టోరీ' ఎట్టకేలకు రెండు వారాల క్రితం విడుదలైంది. శేఖర కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. సాయిపల్లవి జంటగా నటించిన ఈ మూవీ మీద ఉన్నఅంచనాలు అన్ని ఇన్ని కావు.
అయినప్పటికీ కరోనా తర్వాత ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమాను విడుదల చేస్తే.. ఆశించినంత ఫలితం ఉంటుందా? అన్న సందేహాలతో తెగించి విడుదల చేశాడు నిర్మాత ఏషియన్ నారంగ్. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఓపెనింగ్స్ తో పాటు.. ఆశ్చర్యకరంగా ఓవర్ సీస్ నుంచి కలెక్షన్లు బాగా రావటం ఊరటను ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత తోపు సినిమా అయినా.. రెండో వారానికి వచ్చేసరికి దాని క్రేజ్ తగ్గిపోవటం మామూలుగా మారటం తెలిసిందే. అయితే.. ఇందుకు లవ్ స్టోరీ మినహాయింపుగా చెప్పాలి.
దీనికి కారణం.. ఈ వారం సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మినహా చెప్పుకోదగ్గ సినిమా లేకపోవటం..హాలీవుడ్ బాండ్ మూవీ విడుదలైనా దానికి పరిమిత ప్రేక్షకులు మాత్రం రావటంతో.. లవ్ స్టోరీకి సెకండ్ వీక్ సైతం మంచి కలెక్షన్లు వస్తున్నాయని చెబుతున్నారు. శనివారం గాంధీ జయంతి కావటం.. వరుస సెలువులు రావటంతో షాపింగ్ కు.. థియేటర్లకు జనాలు వస్తున్న పరిస్థితి. మొదట్నించి చెబుతున్నట్లే.. వెండితెర మీద తమకు నచ్చిన సినిమాను చూసేందుకు తపిస్తున్న సినీ ప్రేక్షకులు తమ దాహార్తిని తీర్చుకోవటానికి 'లవ్ స్టోరీ' సాయం చేసిందని చెప్పాలి. మొదటి వారం తర్వాత చెప్పుకోదగ్గ కలెక్షన్లు లేవన్న దానికి భిన్నంగా మెరుగైన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ముందు నుంచి అనుకున్నట్లే.. లవ్ స్టోరీ ఎర్లీ బర్డ్ బెనిఫిట్ ను సొంతం చేసుకుందని చెప్పక తప్పదు.