టాలీవుడ్ లో ఓ వింతైన సన్నివేశం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. సినిమా బావుంది అన్న టాక్ వచ్చినా ఎందుకనో వసూళ్ల పరంగా ఆశించినంత దూకుడు కనిపించకపోవడం ట్రేడ్ లో మీమాంశ. అసలెందుకిలా జరుగుతోంది? మంచి ప్రయత్నం.. నవ్యపంథా ప్రయత్నం.. డిఫరెంట్ కథలతో వెరీ గుడ్ ఎటెంప్ట్! అన్న ప్రశంసలు అందుకునీ ఎందుకీ పరిస్థితి? అంటే... ఇటీవల రిలీజైన ఓ నాలుగైదు సినిమాల సరళిని పరిశీలిస్తే తెలిసిన సంగతులివి..
ఇటీవల ఓ నాలుగైదు సినిమాల సన్నివేశం పరిశీలిస్తే ఆసక్తికర సంగతులే తెలిశాయి. సినిమా చూడగానే సూపర్భ్ అన్న ప్రశంస అయితే దక్కినా.. తొలివారం.. మలివారం ఆడుతున్నా బాక్సాఫీస్ వద్ద ఇరగదీసేంత వసూళ్లు అయితే రాలేదని విశ్లేషిస్తున్నారు. వీటిలో నాని `జెర్సీ` ఓ విచిత్రమైన సన్నివేశాన్ని ఎదుర్కొంది. గొప్ప ఎటెంప్ట్ అంటూ యునానిమస్ గా పొగిడేశారు క్రిటిక్స్. కానీ ఏం లాభం చివరికి ఆశించిన స్థాయి వసూళ్లు దక్కలేదన్న టాక్ ట్రేడ్ ని నిరాశపరిచింది.
ఇటీవల రిలీజైన వాటిలో మల్లేశం- ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ- బ్రోచేవారెవరురా- గజేంద్రుడు లాంటి చిత్రాలకు ఆరంభం పాజిటివ్ టాక్ వినిపించింది. ఓ విభిన్నమైన ప్రయత్నం చేశారంటూ క్రిటిక్స్ పాజిటివ్ గా స్పందించారు. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వెల్లువ ఆశించినంత కనిపించలేదని విశ్లేషిస్తోంది ట్రేడ్. ప్రియదర్శి టైటిల్ పాత్రధారిగా బయోపిక్ కేటగిరీలో వచ్చిన మల్లేశం ఎమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్నా డాక్యు సినిమా తరహా అన్న చర్చ సాగింది. దీనికి క్రిటిక్స్ లో మిశ్రమ స్పందన వచ్చింది. కమర్షియల్ హిట్ కాకపోయినా శాటిలైట్ .. డిజిటల్ మల్లేశం కు ప్లస్ అయ్యాయని పరిశ్రమలో చర్చ సాగుతోంది. పరిమిత బడ్జెట్ వల్ల ఫుల్ రన్ లో సేఫ్ జోన్ కి వచ్చే ఆస్కారం ఉందన్న మాటా వినిపిస్తోంది. నవీన్ పోలిశెట్టి- స్వరూప్ కాంబో చేసిన కొత్త ప్రయత్నం `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ` కు పాజిటివ్ రివ్యూలు.. సెలబ్రిటీ ప్రశంసలు కలిసొచ్చాయి.. డిటెక్టివ్ కథతో కంటెంట్ బేస్డ్ సినిమా అన్న టాక్ ప్లస్ అయ్యింది. పలువురు స్టార్ హీరోలు ఈ సినిమాకి ప్రచారం చేయడంతో కొంతవరకూ నిలదొక్కుకోగలిగింది. శ్రీవిష్ణు- నివేద థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన `బ్రోచేవారెవరురా` ఓ విభిన్నమైన ప్రయత్నం అంటూ క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. సమీక్షలతో పాటు ప్రచారం కలిసొచ్చి మూవీ లాభాల బాటలోకి వెళుతోందన్న ప్రచారం సాగింది.
వీటితో పాటు.. సేఫ్ అయిన చిన్న సినిమాలు ఇవీ అంటూ ఆర్య నటించిన గజేంద్రుడు పేరు వినిపించింది. గొప్ప వసూళ్లు దక్కకపోయినా కంటెంట్ బావుందన్న టాక్ .. పరిమిత పెట్టుబడి తో సేఫ్ అయ్యిందన్న ముచ్చటా వినిపించింది. రాజశేఖర్ కల్కి చిత్రానికి 20 కోట్ల మేర బడ్జెట్ పెట్టారు కాబట్టి సేఫ్ జోన్ కి రావడం అంత సులువేమీ కాదన్న చర్చ సాగుతోంది. క్రిటిక్స్ మిశ్రమ స్పందనలు ఈ సినిమాకి కొంత మైనస్. 2019 సెకండాఫ్ ను సమంత `ఓ బేబి` టేకాఫ్ చేసిందన్న ముచ్చట సాగుతోంది. ఈ సినిమాకి క్రిటిక్స్ ప్రశంసలతో పాటు హిట్ టాక్ తో దూసుకుపోతోందని చెబుతున్నారు. ఫుల్ రన్ వసూళ్లు ఎలా ఉంటాయి? అన్నది చూడాల్సి ఉంది.
కొత్తదనం నిండిన కంటెంట్ తో సినిమాలు తీస్తే ఆదరణ దక్కుతోంది అన్న టాక్ వినిపించడం ఓకే కానీ చిన్న సినిమాల కోసం జనాల్ని థియేటర్లకు రప్పించడం ప్రహసనంగా మారిందనేది ఓ విశ్లేషణ. ఓవైపు అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ మాధ్యమ ప్రభావం చిన్న సినిమాలపై తీవ్రంగానే ఉందని చెబుతున్నారు. బావుంది.. హిట్టు అన్న టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా ఆశించిన స్థాయి లేకపోవడానికి పైరసీ- డిజిటల్ విప్లవం పెను సమస్యగా మారాయని విశ్లేషిస్తున్నారు.