మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసీఫర్ సినిమాను తెలుగు లో మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రథాన పాత్రలో రీమేక్ చేయబోతున్నారు. చిరంజీవి ఇమేజ్ కు మరియు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా లూసీఫర్ లో మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ ను రెడీ చేశారు. పరుచూరి వారి నుండి మొదలుకుని పలువురు యంగ్ రచయితలు ఈ స్క్రిప్ట్ వర్క్ లో పాల్గొన్నారు.
సుదీర్ఘ కాలంగా ఈ సినిమా గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరోనా మొదటి వేవ్.. సెకండ్ వేవ్.. ఆచార్య షూటింగ్ ఇంకా పలు కారణాల వల్ల మెగా లూసీఫర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు లూసీఫర్ షూటింగ్ కు ఏర్పాట్లు ముగిశాయి. చిరంజీవి లూసీఫర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్న డేటు కూడా వచ్చేసింది. ఇంకా షూటింగ్ ప్రారంభం కాకుండానే చిరంజీవి లూసీఫర్ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గురించిన అప్ డేట్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం లూసీఫర్ షూటింగ్ లో చిరంజీవి ఆగస్టు 12వ తారీకు నుండి జాయిన్ అవ్వబోతున్నాడు. ఇప్పటికే రీమేక్ కోసం సురేష్ సెల్వరాజన్ ఆధ్వర్యంలో భారీ సెట్టింగ్ ను వేయడం జరిగిందట. ఆ సెట్ కు తుది మెరుగులు దిద్దడంతో పాటు అక్కడ షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను కఅ్కడ చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. షూటింగ్ లో చిరంజీవి ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతాడా అంటూ దర్శకుడు మోహన్ రాజా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆగస్టు 12 నుండి షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు చిరంజీవి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 12వ తారీకున షూటింగ్ ను ప్రారంభించిన చిత్ర యూనిట్ సభ్యులు రెండు వారాల్లోనే తెలుగు లూసీఫర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి పుట్టిన రోజున అంటే ఆగస్టు 22వ తారీకున ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారంటూ వార్తలు అందుతున్నాయి. అదే సమయంలో సినిమా కు సంబంధించిన టైటిల్ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. లూసీఫర్ టైటిల్ నే ఖరారు చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. కాని ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చివరి దశ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆచార్య పూర్తి అయిన తర్వాత వారం పది రోజులు బ్రేక్ తీసుకుంటారని.. ఆ వెంటనే లూసీఫర్ తెలుగు రీమేక్ ను పట్టాలెక్కిస్తారని సమాచారం అందుతోంది. లూసీఫర్ ను కేవలం మూడు నెలల్లోనే ముగించేలా ఇప్పటికే ముందస్తు ఒప్పందాలు జరిగాయట. ఇక లూసీఫర్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వేదాళం రీమేక్ ను కూడా పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వేదాళం రీమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే.