మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి పునఃప్రవేశం చేసినప్పుడు మెగా ఫ్యాన్స్ హంగామా తెలిసినదే. ఖైదీనంబర్ 150 చిత్రాన్ని ఓ రేంజులో గుడులు గోపురాల చుట్టూ తిరిగి బోలెడంత ప్రచారం చేసారు. మెగాస్టార్ బర్త్ డేకి చేసిన హంగామా ఓ లెవల్లో ఇంకా కళ్ల ముందే అలా ఉంది. ఆ తర్వాత 151వ సినిమాగా రిలీజైన సైరా- నరసింహారెడ్డి ఓపెనింగ్ కానీ.. ఇతరత్రా ప్రమోషన్ కార్యక్రమాలు కానీ ఓ రేంజులో హడావుడి జరిగింది టాలీవుడ్ లో. కానీ ఇప్పుడు 152వ సినిమా ఆచార్య సమయంలో కరోనా క్రైసిస్ కల్లోలం రేపింది. ఏకంగా చిరంజీవి .. చరణ్ లకు కరోనా పాజిటివ్ రావడంతో అది సమస్యాత్మకం అయ్యింది.
అయితే తాజాగా చిరు నటిస్తున్న లూసిఫర్ రీమేక్ మూవీ ఓపెనింగ్ ఏమాత్రం హడావుడి లేకుండా జరిగిపోవడం ఫ్యాన్స్ లో చర్చకు వచ్చింది. మెగాస్టార్ ఫ్యాన్స్ గ్రూపుల్లో ఎక్కడా చూసినా పెదవి విరుపు మాటలు వేడెక్కిస్తున్నాయి. లూసిఫర్ రీమేక్ ఓపెనింగ్ ఈ బుధవారం సైలెంట్ గా జరిగింది. అయితే ఎలాంటి హడావుడి లేకుండా జస్ట్ ఓ మూవీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేయడం పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు చిరంజీవి గారి సినిమా ఓపెనింగ్ అంటే ఎలా ఉండాలి? అసలేం బయటకు చెప్పకుండా ఇలా సింపుల్ గా కానిచ్చేయడం మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదని సమాచారం.
ఇక ఈ ఏడాది చిరంజీవి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆచార్య మే 9న విడుదలవుతుంది. అలానే లూసిఫర్ రీమేక్ ని దసరా కానుకగా విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉంటుంది.